Janasena – TDP: జనసేన విషయంలో టీడీపీ ఇంత దారుణంగా వ్యవహరిస్తోందా?

Janasena – TDP: వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ వ్యవహారం గురించి అధికారికంగా ప్రకటన లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేనకు చుక్కలు చూపిస్తుందని తెలుస్తోంది.ఇంకా పొత్తుల గురించి ఎలాంటి ప్రకటన రాకపోయినా జనసేన పార్టీ అధినేత నాదెండ్ల మనోహర్ కి మాత్రం తెలుగుదేశం పార్టీ నిద్ర లేకుండా చేస్తుందని చెప్పాలి. నాదెండ్ల మనోహర్ పొత్తు లేకుండా తెనాలి నుంచి తాను గెలవలేనని భావించారు. దీంతో పొత్తు కుదిరితే తనకు తెనాలి నుంచి సీటు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

ఇలా నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయబోతున్నానని కలలు కంటుండగానే ఆ కలలపై తెలుగుదేశం పార్టీ నీల్లు చల్లిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెనాలి నుంచే పోటీ చేస్తాన‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో నాదెండ్ల మ‌నోహ‌ర్ అవాక్క‌య్యారు. పొత్తు పెట్టుకుంటే త‌న‌కు సీటు గ్యారెంటీ అని భావించిన మనోహర్ కు గట్టి దెబ్బ తగిలిందని తెలుస్తుంది.

కేవలం తెనాలి నియోజకవర్గంలోనే కాకుండా పలుచోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీని ఏమాత్రం లెక్క చేయలేదని తెలుస్తుంది. ఆల‌పాటి రాజా కామెంట్స్‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టికి నాదెండ్ల తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. త‌న‌కే సీటు లేక‌పోతే, రేపు మీరు పోటీ చేసినా మ‌రొక నాయ‌కుడిని చంద్ర‌బాబు నిలుపుతార‌నే అనుమానాల్ని ప‌వ‌న్ ఎదుట తెలియజేయడంతో తెలుగుదేశం ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకొని తీవ్రంగా నష్టపోతున్నామని జనసేన నాయకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ ప‌ర్య‌టించ‌కుండా, పొత్తులో భాగంగా టీడీపీ బ‌లాన్నంతా జ‌న‌సేన గెలుపు కోసం వాడుకుంటామంటే ఎలా అని ఆల‌పాటి ప్రశ్నించారు. కేవలం తెనాలిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో జనసేన కోరుకుంటున్న అన్ని సీట్ల‌లోనూ టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఎదురు తిర‌గ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే జనసేనకు మొదట్లోనే పెద్ద ఎత్తున మోసం జరగబోతుంది అని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -