Tribal Family: గిరిజన కుటుంబం అంటే ఇంత చులకనా.. ఇంత ఘోరంగా అవమానించాలా?

Tribal Family: సాధారణంగా ఒక సినిమా మంచి సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరు సినిమాని ఆదరించినప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది అయితే చెన్నైలో తాజాగా రోహిణి థియేటర్ ఎదుట జరిగినటువంటి పరిణామం చూస్తే మాత్రం కళను ప్రోత్సహించడంలో కూడా ఇలాంటి విభేదాలు ఉంటాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.చెన్నైలోని రోహిణి థియేటర్ ఎదుట జరిగినటువంటి ఈ ఘటనపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా తమిళ హీరో శింబు నటించిన పత్తి తాలా సినిమా నేడు విడుదలైంది అయితే ఈ సినిమా చూడటం కోసం రోహిణి థియేటర్ వద్దకు గిరిజన ప్రేక్షకులు వచ్చారు. అందరిలాగే వారు కూడా టికెట్ తీసుకొని థియేటర్లోకి వెళ్ళబోతూ ఉండగా థియేటర్ యాజమానులు వారిని అడ్డుకున్నారు.ఇలా థియేటర్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారింది.

 

ఇక ఈ ఘటన పై మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సైతం స్పందిస్తూ రోహిణి థియేటర్ వద్ద జరిగిన ఘటన
నన్ను బాధించింది. కళ ఏ ఒక్కరి సొత్తు కాదు. తర్వాత వారిని థియేటర్ లోపలికి అనుమతించారని విన్నాను అంటూ ఈ ఘటనపై స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అయింది. అయితే ఈ ట్విట్ చూసిన నెటిజన్స్ థియేటర్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన థియేటర్ యాజమాన్యం స్పందిస్తూ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారని రూల్స్ ప్రకారం 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని అనుమతించకూడదని వారిని లోపలికి పంపించలేదని తెలిపారు.

 

ఇలా ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం వివరణలో ఏమాత్రం లాజిక్ లేదంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన దర్బార్ సినిమా తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ పిల్లలు చూడవచ్చు అప్పటికి వారి వయసు పది సంవత్సరాలు మాత్రమే ఈ రూల్స్ వారికి వర్తించవా… స్టార్ కిడ్స్ కు అయితే ఒక రూల్స్ ట్రైబల్స్ కు అయితే మరొక రూలా గిరిజనలంటే అంత చులకన అంటూ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -