Suryapet: భర్తకు దూరంగా ఉన్నప్పటికీ ఆ బాధను తట్టుకోలేక భార్య అలా?

Suryapet: సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు కొందరు సర్దుకుపోతుంటారు. ఇంకొందరు గొడవలను మరింత పెద్దది చేసుకుంటూ విడాకులు తీసుకొని విడిపోవడం, భర్త నుంచి సపరేట్ అయి కొద్దిరోజులపాటు వేరుగా కాపురం ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒక మహిళ కూడా భర్త నుంచి వేరుగా ఉంటోంది. కానీ అంతలోనే ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని చింతలబాజర్ కు చెందిన రేపన శాంతికి నాగార్జున సాగర్ కు చెందిన కృష్ణం రాజుతో 6 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు దంపతుల ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే శాంతి భర్త కృష్ణం రాజు ఉద్యోగరిత్యా గత కొన్ని రోజులు నుంచి చెన్నైలో ఉంటున్నాడు. దాంతో అప్పటి నుంచి శాంతి తన పిల్లలతో పాటు పుట్టింట్లోనే తల్లి వద్దే ఉంటోంది.

పిల్లలు కూడా అక్కడే ఉండి చదువుకుంటున్నారు. కాగా గత కొద్దిరోజులుగా శాంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. దానికి తోడు భర్తకు దూరంగా ఉండడంతో ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే తీవ్ర మనోవేదనకు గురైంది. కాగా తాజాగా శుక్రవారం రోజు శాంతి ఉన్నటువంటి తల్లికి చెప్పకుండా పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో కూతురు పిల్లలు కనిపించకపోయేసరికి శాంతి తల్లి ఒక్కసారిగా షాక్ అయింది. శాంతి తల్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అందరూ స్థానిక ప్రాంతాలలో గాలించారు.

అయినప్పటికీ శాంతి దొరకలేదు. ఇక కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాంతి పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శాంతి కనిపించకపోవడంతో ఆమె తల్లి, భర్త శోకసంద్రంలో మునిగిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Sonu Sood: సోనూసూద్ ను కలవడానికి నడిచి వెళ్లిన వ్యక్తి.. చివరకు?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది...
- Advertisement -
- Advertisement -