Mahesh Babu: మహేష్ మంచితనానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉందా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు గతేడాది ఏమాత్రం కలసిరాలేదు. సినిమాల పరంగా చూసుకుంటే.. ‘సర్కారు వారి పాట’ విజయాన్ని సాధించినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన ఎంతో కోల్పోయారు. తల్లిదండ్రులు కృష్ణ, ఇందిరతోపాటు సోదరుడు రమేష్ బాబు కన్నుమూయడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.

 

ఒకే ఏడాది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులను మహేష్ బాబు కోల్పోయారు. తొలుత రమేష్ బాబు చనిపోగా.. ఆ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే ఇందిర, కృష్ణ తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. రమేష్ బాబు మృతితో మహేష్ షాక్ లో వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన కరోనా వ్యాధితో బాధపడుతూ సోదరడి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయారు.

 

ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు
రమేష్ బాబు మృతి నుంచి కోలుకుంటున్న సమయంలో తల్లి ఇందిర మరణం మహేష్ ను మరింత కలచివేసింది. అమ్మ అంటే మహేష్ కు ఎంత ఇష్టమో పలుమార్లు ఆయనే చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే అది ఎంత పెద్ద లోటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ మరణం తర్వాత కొన్నాళ్లకు కోలుకున్న మహేష్.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ లో బిజీ అయిపోయారు. అయితే అన్నీ సమసిపోయాయని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా తండ్రి కృష్ణ మరణం మహేష్ కు ఎటూ పాలుపోకుండా చేసేసింది.

 

తండ్రి మృతితో మహేష్ లో శూన్యం ఆవరించినట్లు అయ్యింది. అయితే మొత్తానికి ఆయను ఆ శోకం నుంచి కోలుకుని తిరిగి షూట్స్ తో బిజీ అయిపోయారు. దీంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఇక అన్న రమేష్ బాబు కుటుంబానికి ఏ కష్టం రాకుండా అంతా తానే ముందుండి చూసుకుంటున్నారట మహేష్. డబ్బు విషయంలోనే కాకుండా రమేష్ బాబు కుటుంబ సభ్యుల భవిష్యత్తు బాగుండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మొత్తానికి, ఘట్టమనేని కుటుంబానికి అన్నీ తానై పెద్దదిక్కులా మహేష్ వ్యవహరిస్తుండటం ఎంతైనా ప్రశంసనీయమనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -