Buddha Statue: బుద్ధవిగ్రహం ఉందా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

Buddha Statue: సాధారణంగా చాలామంది ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. మరి ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గౌతమ బుద్ధుడు జ్ఞానం, సామరస్యం, అత్మ బలానికి చిహ్నం. ఫెంగ్షూయ్, వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైందిగా బావిస్తారు. వాస్తుప్రకారం ఇంట్లో కుడి మూలన బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

కుడి చేతిని తలకింద పెట్టుకుని పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహం జ్ఞానం ముక్తికి ప్రతీక. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శాంతి నెలకొంటుంది. ఈ విగ్రహాన్ని ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకోవాలి. ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్న బుద్ధుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. అలాంటి విగ్రహాన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే ధ్యానంలో ఉన్న బుద్ధుడి ప్రతి మా ఇంట్లో శాంతిని చేకూరుస్తుంది.

 

అలాంటి విగ్రహాన్ని ఇంట్లో మీరు ధ్యానం చేసుకునే ప్రదేశం లేదంటే విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. ఈ విగ్రహాన్ని ఇంట్లోనే బాల్కనీ లేదంటే పూల తోటలో కూడా పెట్టుకోవడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. తోటలో విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం లేదా ద్యాన బుద్దుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకార వస్తువు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని మరచిపోవద్దు. బుద్ధ విగ్రహాన్ని నేల మీద లేదా లాకర్ లో పెట్టకూడదు. బుద్ధ విగ్రహం ఎప్పుడు కూడా చూసేందకు కంటికి సమాంతరంగా లేదా తలపైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి. కళ్లు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. కూర్చుంటున్నపుడు లేదా పడుకుంటున్నపుడు బుద్దుడి వైపు కాళ్లు ఉండకుండా జాగ్రత్త పడాలి.
విగ్రహం చుట్టు చెత్త చేరనియ్యకూడదు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -