Chiranjeevi: ఆ విషయంలో చిరంజీవిని కొట్టే మగాడు పుట్టాడా?

Chiranjeevi: టాలీవుడ్‌కి గాడ్ ఫాదర్‌గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 1978లో ‘పునాది రాళ్లు’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు. కానీ ‘స్వయంకృషి’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఘరానా మొగుడు’ సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లోనే రూ.10 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ‘పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచిదొంగ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. పసివాడి ప్రాణం సినిమా ద్వారానే చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు. అప్పటి నుంచి చిరంజీవికి నటుడితోపాటు డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అనే ప్రయోగాత్మక సోషియో ఫాంటసీ సినిమాను చేశారు.

 

 

‘గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు, బిగ్‌బాస్, రిక్షావోడు, ముఠా మేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి హిట్ సినిమాలు నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినా.. సెట్ కాకపోవడంతో మళ్లీ సినిమాల్లో వచ్చారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ‘గాడ్ ఫాదర్‌’ సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యాన్స్ ను పరిచయం చేసిందే మెగాస్టార్. చిరంజీవిని బీట్ చేసే డ్యాన్సర్ ఇప్పటికీ పుట్టలేదు. సీనియర్ హీరోల్లో చిరంజీవి నంబర్ వన్ డ్యాన్సర్‌గా కొనసాగుతున్నారని సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో నెటిజన్లు షాకవుతున్నారు. డ్యాన్స్ విషయంలో చిరంజీవిని బీట్ చేసే హీరో ఉన్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా.. చిరంజీవికి చిరంజీవే పోటీ అని, అతనిని ఢీకొట్టే హీరో పుట్టులేదని సంబరపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -