Charan: చరణ్ సినిమాల్లోకి రావడం వెనుక ఇంత కథ ఉందా?

Charan: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఎందుకంటే ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మెట్టు మెట్టు ఎక్కుతూ మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఒంటరిగా టాలీవుడ్ మెట్లెక్కిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారారు. ఆయన తర్వాత ఆయన వారసులుగా తమ్ముళ్లు, కొడుకులు, అళ్లుల్లు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు.

 

మెగా వారసుడిగా ముందుగా పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత రామ్ చరణ్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు అటు నాన్న, ఇటు బాాబాయ్ ని కలుపుకుని మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆ తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు యాక్టర్ అవ్వడం ఇష్టం లేదట. మొదట ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నారట. అయితే మెగాస్టార్ కోరిక మేరక రామ్ చరణ్ యాక్టర్ అయ్యారట. నిజానికి మెగాస్టార్ చిరంజీవికి తన కొడుకు రామ్ చరణ్ ని హీరోగా చూడాలని ఉండేది. ఎందుకంటే ఇండస్ట్రీలో తన తర్వాత రామ్ చరణ్ ఉండాలనుకున్నారు కాబట్టి. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవనే విషయం చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి తన అభిమానుల కోసం రామ్ చరణ్ ను మెగాస్టర్ రంగంలోకి దింపారట.

 

అంతే కాదు సినీ ఇండస్ట్రీలో పైకి ఎదుగుతుంటే వెనక నుంచి తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చిరంజీవి అలా కాదు. చిన్న యాక్టర్ ని సైతం పొగుడుతూ ఎంకరేజ్ చేస్తుంటారు. వారిని అభినందిస్తుంటారు. అందుకే తన క్వాలిటీస్ ఉన్న తన కొడుకు సినీ ఇండస్ట్రీకి వస్తే ఇంకొంత మందికి మంచి జరిగే అవకాశం ఉంటుందని చిరంజీవి భావించారు.

 

అయితే టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కు చిన్నప్పుడు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. అయితే మెగా ఫ్యామిలీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండటంతో సినిమాల్లోకి రావాలని సినిమాల్లో సక్సెస్ కావాలని ఆయన భావించారని సమాచారం. దీంతో మెగాస్టార్ వద్దు అనుకున్నదే చివరికి జరిగింది. తాను సినిమాల్లోకి వస్తాను అని రామ్ చరణ్ స్వయంగా చెప్పటంతో చిరంజీవి కొడుకు కోరికను కాదనలేదక ఇండస్ట్రీలోకి వచ్చేలా ఎంకరేజ్ చేసి పలు సినిమాలు తీసేలా చేశారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -