NTR Heroine: తారక్ హీరోయిన్ ను తొక్కేయడం వెనుక ఇంత కథ ఉందా?

NTR Heroine: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ టాలీవుడ్‌తోపాటు పాన్‌ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఎన్టీఆర్‌తోపాటు రామ్‌ చరణ్‌ కూడా ఈ మూవీలో నటించారు. ఇక ఎన్టీఆర్‌ కెరీర్‌ ఆరంభంలోనూ వరుస హిట్లతో రాణించారు. నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

జూనియర్ ఎన్టీఆర్ రెండో మూవీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది. స్టూడెంట్‌ నంబర్‌ వన్‌ సినిమాతో మరో హిట్‌ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ టాలీవుడ్‌లో దుమ్ము దులిపేసింది. కుర్రకారులో హుషారు తెప్పించింది. ముఖ్యంగా కీరవాణి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో అదరగొట్టాడు. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపించేవి. అంతలా పాపులర్‌ అయ్యింది ఈ మూవీ.

 

అప్పట్లో 100 రోజుల ఫక్షన్‌లు గ్రాండ్‌గా జరిగేవి. తర్వాత కొన్ని 175 డేస్‌ కూడా జరిగేవి. ఈ మూవీ కూడా అలాగే ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత 2001 డిసెంబర్‌లో వచ్చిన సుబ్బు మూవీ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఈ చిత్రానికి రుద్రరాజు సురేష్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ సరసన సోనాలి జోషి హీరోయిన్‌గా నటించారు. అయితే, ఈ మూవీ సందర్భంగా ఓ సంచలన విషయం బయటపడింది.

 

అందుకే తొక్కేశారట..
సుబ్బుచిత్రం షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ సురేష్‌ వర్మ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని హీరోయిన్‌ సోనాలి ఆరోపించింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సినిమా సందర్భంగా న్యూజిలాండ్‌లో షూటింగ్‌ జరుపుకుంటుండగా ఓ రోజు రాత్రి దర్శకుడు తాగి వచ్చి తనతో గడపాలని హుకుం జారీ చేశాడని చెప్పింది. దీనికి తిరస్కరించడంతో అప్పటి నుంచి పగబట్టారట. ఆ తర్వాత సోనాలీ జోషికి ఇండస్ట్రీ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయట. అనంతరం ఈమెకు అవకాశాలిస్తే లేనిపోని డిస్టబెన్స్ క్రియేట్‌ చేస్తుందనే ఉద్దేశంతో ఏ దర్శకుడూ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదట. ఫలితంగా ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -