Avatar 2: అవతార్2 రిజల్ట్ వెనుక ఇంత కథ ఉందా?

Avatar 2: ఈ ఏడాది చివరిలో విజువల్ వండర్ అయిన అవతార్2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచి ఈ సినిమా అనుకున్నంత టాక్ తో ముందుకు సాగలేదు. అవతార్ సినిమాలో కన్నా అవతార్2 సినిమాలో అంతగా కథ కనెక్ట్ కాలేదు. కామెరూన్ స్క్రీన్ ప్లే అంతగా బలం చేకూర్చలేదు. సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్సే కనబడిందని ప్రేక్షకులు వాపోతున్నారు. ఈ సినిమా తీయడానికి 12 ఏళ్లు పట్టింది. అయితే సినిమాలో ట్విస్టులు అంతగా లేవు. కథ మాత్రం సాఫీగా సాగింది.

 

అవతార్ 1 సినిమా ప్రభావం ఇప్పటికీ ప్రజలపై ఉంది. అందుకే అవతార్ 2 సినిమా కోసం అందరూ ఎదురుచూశారు. అయితే ఈసారి సినిమాల్లో కొత్తగా ఏమీ కనపడలేదు. గాలిలో ఎగిరే డ్రాగన్ తరహా పక్షులతో పాటుగా నీటిలో తిరిగే తిమింగలాలు, చేపలు కాస్త అటుఇటుగా కనిపించాయి. సినిమా చూస్తున్న చాలా మందికి చిన్న పిల్లల యానిమేషన్ లాగా అనిపించింది.

 

కామెరూన్ క‌థ చెప్పే ప‌ద్ధ‌తి వేరుగా ఉంటుంది. సినిమా ప్రారంభంలో మెరుపులు, షాక్‌లు ఉండకుండా కథలోకి స్లోగా తీసుకెళ్తాడు. ప్రతి చిన్న పాత్రకు మంచి గుర్తింపు ఇస్తాడు. ప్రేక్షకులను కామెరూన్ మరో లోకానికి తీసుకెళ్తాడు. అవతార్ 1లో అమాయ‌కంగా జీవించే ఆదివాసుల‌కి దురాశ‌ప‌రుల‌కి మ‌ధ్య జ‌రిగే యుద్ధంలో హీరో బాధితుల వైపు నిల‌బ‌డి యుద్ధం చేసే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.

 

పార్ట్‌-2లో మాత్రం అలాంటి కథనం కనపడలేదు. పార్ట్‌-2లో మాత్రం వ్య‌క్తిగ‌తంగా జరిగే యుద్దాన్ని చూపెడతారు. హీరో తన కుటుంబాన్ని ర‌క్షించుకోడానికి దూరంగా పారిపోయేలా చూపెడతారు. అవతార్2లో కొన్నిసార్లు డైలాగులను విని హీరోని గుర్తు పట్టాల్సి వస్తుంది. అలాగే టైటానిక్ హీరోయిన్ కూడా నటించింది కానీ ఆమె ఏ పాత్రలో చేసిందో చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. ప్రేక్ష‌కుడికి ఇప్పుడు కొత్తదనం కావాలి. ఆ కొత్తదనం తరహా కథలే ఎక్కువగా ఈమధ్య హిట్ అవుతున్నాయి. కానీ కామెరూన్ మాత్రం అవతార్2తో నిరాశపరిచాడనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -