Vastu: ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలం ఉందా? దాని వాస్తు తెలుసుకోండి

Vastu: వాస్తు శాస్త్రంలో ఇంటి పరిసరాల్లో ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉండాలో కొన్ని నియమాలు నిపుణులు వివరించారు. సాధారణంగా ఇంటిని నిర్మించుకొనేటప్పుడు వాస్తు ప్రకారం ఫాలో అవుతుంటారు. బెడ్ రూమ్, వంట గది, హాలు, కిటికీలు, తలుపులు ఏ దిశలో ఉండాలో వాస్తు ప్రకారమే నిర్మాణం చేపట్టేలా కొందరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంటిలో ఖాళీ స్థలం ఎక్కడుండాలనే విషయంపై కూడా వాస్తు పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

 

ఏ ఇంట్లో అయినా ఖాళీ స్థలం చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. ఇల్లు లేదా భవనం గాలి, సానుకూల శక్తిని నిర్ణయించడంలో ఖాళీ స్థలం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇల్లు లేదా భవనంలో ఖాళీ స్థలం ఎక్కడ ఉండాలనే విషయంపై నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. ఖాళీ స్థలం ఉంటే శుభమా, అశుభమా? అనే విషయాలపై క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయంలో కొన్ని సూత్రాలు పాటించి ఇంట్లో కుటుంబ సభ్యుల శ్రేయస్సు, సంపద, సంతోషాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు.

 

 

ఏదిశలో ఉంటే శుభప్రదమంటే..

ఇంట్లో ఖాళీ స్థలం తూర్పు, ఉత్తర దిశ, ఈశాన్యం.. అంటే ఈశాన్యంలోని స్థలాన్ని ఇంట్లో మరింత తెరిచి ఉంచడం శుభప్రదం, ప్రయోజనకరం అని వాస్తుం పండితులు సూచిస్తున్నారు. అలాగే వరండా, బాల్కనీ, పోర్టికో, టెర్రస్, ఇల్లు లేదా భవనాన్ని ఈశాన్యంలో ఉంచినట్లయితే ప్రశాంతత చేకూరుతుందంటున్నారు. వరండా, బాల్కనీ, పోర్టికో, టెర్రేస్ ఓపెన్ స్పేస్ కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

 

 

మరోవైపు రెండంతస్తుల భవనం ఉంటే, దాని ఎత్తు తూర్పు, ఉత్తరం వైపు ఉండాలట. అలాగే ఇంటి పైకప్పు తూర్పు, ఉత్తర దిశలో తెరిస్తే బెటర్ అంటూ సలహాలిస్తున్నారు. ఇంట్లో కిటికీలు, తలుపుల సంఖ్య తూర్పు, ఉత్తర దిశలో ఎక్కువ ఉండాలని సూచిస్తున్నారు. అయితే, కిటికీలు, తలుపుల సంఖ్య సమానంగా ఉండే ప్లాన్ చేసుకోవాలట. ఇంట్లోని మధ్య ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అంటారని, ఇది తెరిచి ఉండాలని సూచిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -