Warangal: ప్రీతి చనిపోవడానికి మరో కారణం కూడా ఉందా.. కాలేజీ యాజమాన్యం నిర్ణయమే కారణమా?

Warangal: వరంగల్ కేసీఎం పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. వరంగల్‌ కేఎంసీ కాలేజీలో పీజీ చదువుతోన్న సీనియర్ విద్యార్థి సైఫ్ అనే దుర్మార్గుడి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకోగా ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందగా తాజాగా నిన్న ఆమె అంత్యక్రియలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ప్రీతి మరణాన్ని ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కూతురు ప్రీతి మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రీతి కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రీతి కేసులో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వైద్య విద్యలో సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ రూ.50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తరువాత ఏవైనా కారణాలతో కోర్సు మధ్యలో డ్రాప్ అయితే విశ్వవిద్యాలయానికి డబ్బులు చెల్లించాలి. అయితే ఇప్పుడు ఇదే ప్రీతి పాలిట శాపమైందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత ఏడాది వర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలో వదులుకుంటే రూ.20 లక్షలు చెల్లించాలనే నిబంధన ఉండేది. అయితే చాలా మంది వైద్య విద్యార్థులు మధ్యలోనే వెళ్లిపోతున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.50 లక్షలు పెంచింది.

 

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు కాలేజీ వదిలి వెళ్లేందుకు ధైర్యం చేయటం లేదని కొందరి వాదన. అలాగే వేధింపులు, ర్యాగింగ్, ఇతరత్ర ఇబ్బందులు ఉన్నా వాటిని భరిస్తూ పీజీ పూర్చి చేస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రీతి విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుంది అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. సీనియర్ వేధించినప్పుడు కాలేజీ విడిచి వెళ్లలేక అంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేక ఆమె వేదనకు గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేధింపులు తట్టుకోలేక, మధ్యలో డ్రాప్ అయితే అంత మొత్తంలో డబ్బులు చెల్లించలేమని ప్రీతి తీవ్ర మనోవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ర్యాగింగ్ పై కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని అలాగే అడ్మిషన్ బాండ్ విషయంలో కూడా కొన్ని విషయాలలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -