Chiranjeevi: చిరంజీవి రేంజ్ లో సహాయం చేసే మరో స్టార్ హీరో ఉన్నారా?

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న గౌరవం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ నటులలో ఆయన ఒకరు. కానీ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికీ తన నటనలో, డాన్స్ లో ఎక్కడ కూడా ఎనర్జీని తగ్గించుకోలేదు చిరు. పైగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 

ఈ వయసులో కూడా చిరంజీవి ఎనర్జీ గురించి చాలా మంది యంగ్ హీరోలు మాట్లాడుకున్నారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. తను ఒక్కడే కాకుండా తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఒక నటుడుగా ఎంత మంచి హోదా సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి గుర్తింపు అందుకున్నాడు.

వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది ప్రజలను అభిమానులుగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలా ఉంటుందన్నమాట. సినీ ఇండస్ట్రీలో కూడా చిరంజీవికి నటుడుగా కంటే వ్యక్తిగతంగా ఒక గుర్తింపు ఉంది. ఆయన ఎంతో మంది ప్రజలను, ఇండస్ట్రీకి చెందిన నటీనటులను ఆపద సమయంలో ఆదుకొని మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు.

 

ఇప్పటికే చిరంజీవి ఎంతో మంది ప్రజలకు ఆర్థికంగా సహాయం చేశాడు. సొంతంగా బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశాడు. కోవిడ్ సమయంలో కూడా వెనకాడలేదు చిరంజీవి. ఇప్పటికీ ఆపదలో ఉన్నా వారిని కాపాడుతూనే ఉన్నాడు. అయితే ఈయన తాజాగా మరోకరికి సహాయం చేసినట్లు తెలిసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా చేసిన ఓ నటుడు చిరు గురించి ఒక విషయాన్ని తెలిపాడు.

 

తన ఆరోగ్యం బాలేక కిడ్నీ ఫెయిల్ అయ్యి ఎవరిని సహాయం అడగాలో తెలియక చిరంజీవి గారికి ఫోన్ చేసానని.. ఒక లక్ష లేదా రెండు లక్షలు ఇస్తారేమో అనుకున్న కానీ అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వమన్నారని.. అక్కడ 40 లక్షలు ఖర్చు అయ్యిందని మొత్తం ఆయనే చూసుకున్నారని అన్నాడు. దీంతో చిరు అభిమానులు.. మెగాస్టార్ గొప్ప.. మెగాస్టార్ మాత్రమే గొప్ప అంటూ.. చిరంజీవి రేంజ్ లో సహాయం చేసే మరో స్టార్ హీరో ఉన్నారా అంటూ గొప్పగా పొగుడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -