Balayya: ఆ హీరోయిన్ కు బాలయ్యకు మధ్య ప్రేమ ఉందా?

Balayya: నటసింహం నందమూరి బాల‌కృష్ణ అంటే పడిచచ్చేవారు చాలా మంది ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి బాగా తెలుసు. తండ్రి సీనియ‌ర్ ఎన్టీఆర్ కు త‌గ్గ తనయుడిగా బాలయ్య సినీరంగంలో నిలబడ్డారు. తండ్రి నేర్పిన నటనా విలువలతో సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తున్నారు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇటు మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి మనిషి. బసవతారకం ఆస్పత్రిని నడిపిస్తూ ఎంతో మందికి సేవ చేస్తున్నారు.

 

ప్రతి ఏడాది బాలయ్య సినిమా ఒక్కటైనా థియేటర్లలో సందడి చేయడం ఖాయం. అలాంటి బాలయ్య సినీ కెరీరీ బాగానే ఉన్నా ఆ మధ్య కెరీర్ ప్రారంభంలో ఆయనో హీరోయిన్ ను ప్రేమించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయం చాాలా తక్కువ మందికే తెలిసిన విషయం. తండ్రి నందమూరి తారక రామారావు రాజకీయాల్లో బిజీగా ఉండే టైంలో బాలయ్య సినీ ఎంట్రీ మొదలైంది. ఆ టైంలో చెన్నైకు చెందిన ఓ హీరోయిన్ తో బాలయ్య లవ్వాడట.

 

సినీ కెరీర్ మొదటల్లో బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ఓ స్టార్ హీరో హోదాను దక్కించుకున్నారు. ఆ సమయంలోనే మద్రాస్ ఇండస్ట్రీలో ఓ అందాల ముద్దుగుమ్మను ఇష్టపడ్డాడట. బాలయ్య ఆ హీరోయిన్ ను సిన్సియర్ గా లవ్ చేశాడని, ఆ విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో ఆయన సీరియస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో పాటుగా అన్న హ‌రికృష్ణ‌కు కూడా తన ప్రేమ విషయం తెలిసి వెంటనే జాగ్రత్త పడ్డారట. ఇకవారు ఆలస్యం చేయకుండా కాకినాడకు చెందిన తమ బంధువుల అమ్మాయి వసుంధరను బాలయ్యకు ఇచ్చి పెళ్లి చేశారట.

 

తన పెళ్లి టైంలో బాలయ్య ఎంతో బాధను అనుభించారని సన్నిహితులు కూడా చెప్పేవారట. బాలయ్య చాలా సిన్సియర్ గా ఆ హీరోయిన్ ను ప్రేమించారని, అయితే తన ప్రేమ ఫలించలేదని అప్పట్లోనే భారీగా టాక్ వినిపించింది. తండ్రి, అన్నయ్య సూచన మేరక వసుంధరను పెళ్లి చేసుకుని ఇప్పుడు బాలయ్య సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -