Rashi Khanna: స్టార్ హీరోకు రాశీకు మధ్య అలాంటి బంధం ఉందా?

Rashi Khanna: నందమూరి వంశంలో ఇప్పుడు పెద్ద దిక్కుగా బాలయ్య ఉన్నారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య ఫుల్ స్వింగ్‌ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అరవై ఏళ్లు దాటిన బాలయ్య ఇరవయ్యేళ్ల కుర్రాడిలా రెచ్చిపోతున్నాడు. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్యలోని కొత్త కోణాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న ఈ ప్రోగ్రామ్‌ లో బాలయ్య తనదైన స్టైల్‌ లో చెలరేగిపోతున్నారు.

 

అన్ స్టాపబుల్ షో ఇప్పటికే ఫస్ట్‌ సీజన్‌ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండో సీజన్ లోకి అడుగుపెట్టింది. అది కూడా పూర్తి కావస్తోంది. ఈ షోకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి లాంటి రాజకీయ నేతలతో పాటుగా హీరోలు ప్రభాస్‌, గోపీచంద్, శర్వానంద్‌, విశ్వక్‌ సేన్ వంటి వారు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ షోకు సీనియర్‌ హీరోయిన్లు జయసుధ, జయప్రదతో పాటు యంగ్ హీరోయిన్‌ రాశిఖన్నా కూడా వచ్చారు.

 

అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో రాశీ ఖన్నా సందడి చేసిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందమైన హీరోయిన్లు కనిపిస్తే బాలయ్య వదలడని అందరూ అంటుంటారు. అందుకే రాశీ కన్నాను నీ ఫస్ట్ క్రష్ ఎవరని బాలయ్య అడిగాడు. బాలయ్య ప్రశ్నకు రాశిఖన్నా కాసేపు మౌనంగా ఉండిపోయారు. అబద్దం చెప్తే బాలయ్య పట్టేస్తాడని భావించి చివరకు విజయ్‌ దేవరకొండ అని తెలిపింది.

 

రాశి ఖన్నా మాటలకు షోలో అందరూ అరుపులు, కేకలతో సందడి చేశారు. గతంలో విజయ్‌ దేవరకొండతో రాశిఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే టాక్‌ బాగానే వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె ఫస్ట్‌ క్రష్‌ విజయ్‌ దేవరకొండ అని చెప్పడంతో సోషల్ మీడియాలో వీరి ఎఫైర్ వార్తలు షికారు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -