Samantha-Vijay Devarakonda: సమంత విజయ్ దేవరకొండ మధ్య అంత క్లోజ్ రిలేషన్ ఉందా?

Samantha-Vijay Devarakonda: టాలీవుడ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్యన సమంత ఆరోగ్యం బాగోకపోవటంతో షూటింగ్ కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

ఇప్పటికే ఖుషి మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ నీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటకి విజయ్ రియల్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.

అందులో విశేషం ఏముంది అంటారా.. ఈ రీల్ లో సమంతతో కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. సమంతని వెనకనుంచి హగ్ చేసుకుంటూ కనిపిస్తాడు. దీని మీద కొందరు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అయితే రీల్ చేస్తున్నట్లుగా సమంతకి తెలియక పోవడం విశేషం. నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే అంటూ లిరిక్స్ తగ్గట్టుగా సమంతతో రిల్ చేశాడు విజయ్.

 

ఆ రీల్ కూడా వైరల్ గా మారింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

 

ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నా రోజా నువ్వే అనే పాటని కూడా ఆయనే పాడారు. ఈ గీత రచయిత దర్శకుడు శివానిర్మాణ కావటం మరొక విశేషం. అసలే టైగర్ మూవీ తో అట్టర్ ఫ్లాప్ ని మూట కట్టుకున్న విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నాడు. సినిమా హిట్టో ఫట్టో తెలియాలంటే సెప్టెంబర్ ఒకటి వరకు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -