Balayya Song: బాలయ్య పాడిన ఘంటసాల పాట వెనుక ఇంత కథ ఉందా?

Balayya Song: టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబుకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. బాలకృష్ణ ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలె వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఓటీటీలో అన్ స్టాపబుల్ లాంటి షో లతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ షో ద్వారా బాలయ్య బాబు తనలో ఉన్న మరో టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా బాలకృష్ణ లో కూడా ఒక సింగర్ దాగున్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పటికే గతంలో పలు సందర్భాలలో బాలయ్య బాబు పాటలు పాడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వేదికపై బాలయ్య బాబు పాడిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో పాటు చప్పట్లతో సభా ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోయింది. ప్రొఫెషనల్ సింగర్ లా బాలయ్య బాబు పాట పాడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఖతార్ రాజధాని నగరం దోహాలో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు.

 

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా నంద‌మూరి బాల‌య్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య బాబు జ‌గ‌దేక‌వీరుని క‌థ సినిమాలోని శివశంకరి అనే పాట‌ను బాల‌య్య ఆల‌పించ‌డం విశేషం. పాట పాడుతున్న సంద‌ర్భంలో బాల‌య్య‌కు బ్యాగ్రౌండ్‌లో మంట‌లు చెల‌రేగుతున్న దృశ్యాలు ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకున్నాయి. బాలయ్య బాబు పాట చక్కగా పాడడంతో అందరూ చెప్పట్లతో మరింత ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా పక్కనే ఉన్న సింగర్లు కూడా బాలయ్య బాబు పాట విని ఆశ్చర్యపోయారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -