BRS: మహారాష్ట్ర వాళ్లను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం వెనుక ఇంత కథ ఉందా?

BRS: బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. కేవలం ఒక మహారాష్ట్ర నుంచి మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఎందుకు ముందుకు రావడం లేదు అన్నది ప్రశ్నకరంగా మారింది. ఈ నేపథ్యంలోని తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాకుండా రేవంత్ రెడ్డి బయట పెట్టిన సీక్రెట్ గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కిరాయి మనుషులను తీసుకువచ్చి కండువాలు వేసి పంపిస్తున్నారు.

ఈ డ్రామా ఆడటానికి ప్రత్యేకంగా ఓ వ్యక్తిని ప్రజాధనం జీతంగా ఇచ్చి మరీ నియమించుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపిపించాలి. కాగా ఇటీవల కొద్ది రోజుల కిందట మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ అనే వ్యక్తి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి బీఆర్ఎస్‌లో చేరారంటూ ఆ పార్టీ నేతలు తెగ హడావుడి చేశారు. అయితే చివరికి శరత్ మర్కట్‌కు సీఎంవోలో ఉద్యోగం ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శరత్ మార్కట్ సీఎం కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని రేవంత్ ఆరోపించారు. అతడికి నెలకు లక్ష యాభై వేల జీతం ఇస్తున్నారని ఆరోపించారు.

 

ఇందుకు సంబంధించిన జీవోని ప్రభుత్వం దాచిపెట్టిందని తెలిపారు రేవంత్ రెడ్డి. పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తున్నాడని మండిపడ్డారు. అలాగే వారానికి ఒకసారి మహారాష్ట్ర నుంచి చేరికల కార్యక్రమాన్ని శరత్ మర్కట్ నిర్వహిస్తూంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర నేతలకు పెద్ద ఎత్తున ఆఫర్లు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఒక మహారాష్ట్ర వ్యక్తికి జీతం ఇచ్చి మరీ సీఎంవోలో పెట్టుకోవడం అన్నది వివాదాస్పదంగా మారింది. కాగా ప్రస్తుతం చాలా జీవోలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు. రేవంత్ చెబుతున్న జీవో బయటకు వస్తే సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి డబ్బులు ఇచ్చి మరి పార్టీలో చేరిపించుకోవడం అన్నది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -