Viveka: వివేకా ఆస్తుల విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇదేనా.. అలా జరిగిందా?

Viveka: వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమై ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో పాల్గొంటున్నప్పటికీ ఏపీలో షర్మిల పేరు మారు మోగిపోతోంది. మరి ముఖ్యంగా వివేకా హత్య కేసు కు సంబంధించిన వ్యక్తులులో షర్మిల కూడా కీలకమైన వ్యక్తి అని చెప్పవచ్చు అవినాష్ రెడ్డి పై నిందలు వేసిన వారు షర్మిల పేరును కూడా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. కడప ఎంపీ టికెట్ షర్మిలకు లేదా తనకు ఇవ్వాలని వివేకా డిమాండ్ చేశారని, అందుచేతనే అవినాష్ రెడ్డి హత్యకు పథక రచన చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అంతేకాకుండా హత్యకు గురైన ముందురోజు కూడా తనకోసం చేసిన ఎన్నిక ప్రచారాన్ని ప్రస్తావిస్తారు. ఇది కేవలం ఆస్తి కోసం జరిగిన హత్యగా ఆయన చెబుతున్నారు. వివేకాకు రెండో వివాహం అయిందని, ఆమె ద్వారా పుట్టిన కొడుకు కు ఆస్తి వెళ్లకుండా, ఆయన మొదటి భార్య కూతురు సునీత, అల్లుడు కలిపి హత్య చేయించారు అని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయాలపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఇది ఆస్తికోసం జరిగిన హత్య కానే కాదు. నిజానికి సునీత అవినాష్ రెడ్డిని ఇరుకు పెట్టేలాగా, ఆయన మీద అనుమానాలు మరింత పెరిగేలాగానే మాట్లాడారు.

 

కానీ జాగ్రత్తగా లోతుగా గమనిస్తే షర్మిల మాటల అంతరార్థం వేరే ఉంది. హత్య కేవలం సునీత లేదా ఆమె తరఫు పనిచేస్తున్న వాళ్లు చేయించినట్లుగా అర్థమవుతోంది. కాగా ఆస్తులన్నీ సునీత పేరుతో ఎప్పటినుంచో ఉన్నాయని,ఆస్తులను సునీత పేరుతో పెడుతూ వివేకానందరెడ్డి చాలా కాలం కిందటే వీలునామా రాశారని,అందువల్ల సునీత ఈ హత్య చేయించే అవకాశం లేదని షర్మిల తెలిపారు. ఇక్కడ మరొక విషయం వెలుగులోకి వస్తోంది. అదేంటంటే షర్మిల అన్న మాటలు ప్రకారం చూసుకుంటే హత్య చేయించాల్సిన అవసరం సునీతకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆస్తులన్నీ సునీత పేరుతో రిజిస్టరు అయి లేవు. కేవలం వివేకా ఆమె పేరుతో వీలునామా రాశారు. అది జరిగి చాలా కాలం అయింది. కాగా వీలునామా అనేది శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచు కోవాలి. ఒకవేళ రిజిస్టరు చేసి ఉన్నా సరే.. సదరు వీలునామాను అదే వివేకా మళ్లీ మార్పించి రాయించి, మళ్లీ రిజిస్టరు చేయడానికి లీగల్ గా అవకాశం ఉంటుంది. అంటే వివేకానందరెడ్డి జీవించి ఉంటే సునీత పేరిట ఉన్న ఆస్తులు ఏదో ఒక క్షణంలో పూర్తిగా వివేకా రెండో భార్య కొడుకు పేరు మీదికి మారిపోయే అవకాశం ఉంది. వీలునామాను తిరిగరాయించే అవకాశం ఉండేది. కేవలం అందుకోసమే సునీత, ఆమె భర్త ఈ హత్య చేయించి ఉండవచ్చని షర్మిల మాటలను లోతుగా గమనించిన వారికి ఇటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -