AlluArjun: అల్లు అర్జున్ చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదేనా?

AlluArjun: సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప- ది రూల్’ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పుష్ప-2 సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

 

‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్నారు. దేశముదురు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ‘పరుగు, ఆర్య, వేదం’ వంటి సినిమాలతో బన్నీకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ‘రేసుగుర్రం, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, అలవైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బన్నీ నటించిన చాలా వరకు సినిమాల్లో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అందుకే బన్నీకి స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు కూడా వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ కూడా బన్నీ స్టైల్‌ని కాపీ చేస్తుంటారు.

 

అయితే బన్నీకి కొంచెం అతి ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్‌లో ఎక్కడ కనిపించినా.. ఏదో ఒక ఆరోపణలు చేస్తూ.. జనాలకు కోపం వచ్చే పని చేస్తుంటాడు. అప్పట్లో బన్నీపై సోషల్ మీడియాలో భారీగానే ట్రోల్ జరిగేది. కానీ రాను రాను తన ప్రవర్తనను మార్చుకున్నాడు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఫ్యాన్ ఫాలొయింగ్ పెరగడంతో బన్నీ సెక్యూరిటీపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం బన్నీ ఎక్కడికి వెళ్లినా బౌన్సర్లతో హడావిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బన్నీ అతిగా ప్రవర్తిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ అతి వల్ల బన్నీ పరువు పోతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -