Siddharth: సామ్ తో లవ్ ఫెయిల్యూర్ గురించి సిద్దార్థ్ కు అలాంటి అభిప్రాయమా?

Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ ఒకరు. ఎన్నో ప్రేమకథ చిత్రాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం తన ప్రేమను సక్సెస్ చేసుకోలేకపోయారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతోమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి సిద్దార్థ్ తాజాగా టక్కర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈయన పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్దార్థ్ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ క్రమంలోనే యాంకర్ సిద్దార్థ్ ను వ్యక్తిగత ప్రేమ విషయాల గురించి ప్రశ్నించి తన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

 

ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ కెరియర్ పరంగా ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలలో నటించి అందరిని మెప్పించిన మీరు మీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమను సక్సెస్ చేసుకోలేకపోయారు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సిద్దార్థ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇలాంటి విషయం గురించి తాను ఇప్పటివరకు ఆలోచించలేదని తెలిపారు.

 

నా రియల్ లైఫ్ గురించి మీరిద్దరూ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కనుక మనిద్దరం ఎప్పుడైనా పర్సనల్గా కూర్చున్నప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కు మీరు అడిగిన ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా సిద్దార్థ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన గతంలో సమంతను ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న విషయం మనకు తెలిసిందే. చివరి క్షణంలో వీరిద్దరూ విడిపోయారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -