God Father: గాడ్ ఫాదర్ లో అవి మాత్రమే ఉన్నాయా.. వాళ్లకు నచ్చకపోతే డిజాస్టరే?

God Father: తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో విడుదల కాబోయే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళం లో లూసిఫర్ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అయింది. కాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ గాడ్ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్ లు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఈ దసరా కానుకగా వారం రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లో కథ కథనాలు చూస్తుంటే లూసిఫర్ సినిమాలో మాదిరిగానే కనిపిస్తున్నాయి. కానీ మేకింగ్ విషయం లోకి వస్తే జనాలకు అలవాటైన మెగాస్టార్ మాస్ యాక్షన్ సినిమా భారీ రేంజ్ లో చూసినట్లు అనిపిస్తుంది. లూసిఫర్ ఇచ్చే కొత్త అనుభూతిని గాడ్ ఫాదర్ సినిమా ఇవ్వలేకపోయింది. నిజానికి లూసీఫర్ సినిమా ఒక వర్జిన్ ఆర్గానిక్ లుక్ లో ఉంది.

కానీ గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ చూస్తుంటే అలవాటైన భారీ యాక్షన్ సినిమా చూసిన ఫీల్ కొందరు ప్రేక్షకులకు కలుగుతుందట. అయితే కొంతమంది గాడ్ ఫాదర్ సినిమాలో ఇలాంటి లూప్స్ ఉంటే కొంతమంది ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకోలేక పోతుంది. అంతేకాకుండా పూర్తిగా డిజాస్టర్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని కొందరు భావిస్తున్నారు. మరి ఈ దసరాకు ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా తాజాగా చిరంజీవి మాత్రం అనంతపూర్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎంతో కాన్ఫిడెంట్ గా తెలిపాడు. వర్షంలో తడుస్తూ మరీ వర్షం పడితే నాకు చాలా సుభ సూచికంగా అనిపిస్తుంది. ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వరుణ దేవుడిని ప్రార్థించాను. వెంటనే వరుణుడు కరుణించాడు. కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఈ సినిమా విషయంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నట్లు తెలిపాడు చిరంజీవి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -