Vijay: తల్లీదండ్రులకు గౌరవం ఇవ్వని ఈ స్టార్ హీరో ఒక మనిషా?

Vijay: తమిళ స్టార్ హీరో అయిన దళపతి విజయ్ గురించి మనందరికీ తెలిసిందే. దళపతి విజయ్ కు తమిళంతో ఇతర ఇండస్ట్రీలలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా తెలుగులో విజయ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా విజయ్ పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. యూత్ లో విజయకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది ఇలా ఉంటే విజయ్ ఇటీవల నటించిన చిత్రం వారిసు. ఈ సినిమాను తెలుగులో వారీసుడు పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

తమిళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో కూడా పరవాలేదు అనిపించేలా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో దళపతి విజయ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే విజయ్ వారీసు సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో తన తల్లిదండ్రులని అవమానించారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారిసు ఈవెంట్‌లో విజయ్‌ తన తల్లిదండ్రుల్ని సరిగా పట్టించుకోకపోవడం మాత్రమే కాకుండా వారికి ఇవ్వవలసిన మర్యాద కూడా ఇవ్వలేదు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఈ ఏడాది జనవరి 2వ తేదీన వారిసు ఆడియో లాంచ్‌ చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగిన విషయం విధితమే. అయితే ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటుగా విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ అలాగే తల్లి శోభన కూడా హాజరయ్యారు. విజయ్‌ ఆడియో ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు కూడా వచ్చారు. వారిని కూడా పలకరించి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు. అయితే, సొంత తల్లిదండ్రుల్ని సరిగా పట్టించుకోలేదని, ఏదో మొక్కుబడిగా వారిని పలకరించారన్న వార్తలు ప్రస్తుతం నెట్టింట ఊపందుకున్నాయి. అయితే కొడుకు విషయంలో వస్తున్న వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ వేడుక కేవలం వారిసు సినిమా కోసం..విజయ్‌ కోసం జరిగింది. ఓ పెద్ద ఈవెంట్‌లో నా కుమారుడినుంచి అంతకన్నా మేం ఏం ఆశిస్తాం చెప్పండి అని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -