JrNTR: తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ డేట్ ఇదేనా?

JrNTR: ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏపీలోని పలు ప్రదేశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో ఎక్కువగా టిడిపి దే పై చేయి కనిపించడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీ గెలవడం ఖాయం అని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపికి మంచి రోజులు రాబోతున్నాయి అని టిడిపి నేతలు సంబరపడుతున్నారు. కాగా ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అశేష ప్రజాదరణతో 50 రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా సైకిల్ హవానే నడుస్తోంది. నారా లోకేష్ పాదయాత్రలో తాజాగా నారా వారి కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. సోదరుడితో అడుగు కలిపి నడిచారు. ఆ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకే మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా నారా రోహిత్ మరో బాంబును కూడా పేల్చారు. అదేమిటంటే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగనున్నారని వెల్లడించారు.

 

వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ 2009 లోనే విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన ప్రచారానికి బ్రహ్మాండమైన ప్రజా మద్దతు లభించింది. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకీ రాకుండా పూర్తిగా కెరిర్ పై శ్రద్ద పెట్టారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే గతంలో ఎన్నో సార్లు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

 

ఎన్టీఆర్ టీడీపీ లోకి ఎంట్రీ ఇస్తే బాగుటుంది అని టీడీపీ పార్టీ నేతలు అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన తెలుగుదేశంకు మద్దతుగా వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. కాగా పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగుతారనీ, సమయం వచ్చినప్పుడు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. ఇప్పుడు తాజాగా నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చెప్పడంతో ఆయన పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగే సమయం ఆసన్నం అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. మరి ఈ వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -