Nayanthara: నయనతార సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా?

Nayanthara: టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే. ఆయన ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. గతేడాది బాలయ్య అఖండ సినిమాతో భారీ హిట్టు కొట్టాడు. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో బాలయ్య సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య అటు సినిమాలు చేసుకుంటూ ఇటు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. అంతేకాదు అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వుతున్నారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య చిన్నపిల్లాడి లాగా చేస్తున్న అల్లరి అందరికీ మంచి వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ అయిన నయనతార గురించి నందమూరి బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. కనెక్ట్ అనే హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు నయనతార వచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో నయనతార బాలయ్యతో వర్క్ గురించి చెప్పుకొచ్చింది. బాలకృష్ణ సార్ తో తాను డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేశానని, ఆయన్ని చూసి అందరూ భయపడతారు కానీ బాలకృష్ణ సార్ చాలా సరదాగా ఉంటారని నయనతార చెప్పుకొచ్చింది.

బాలయ్య చాలా మంచి మనిషి అని, గతంలో తాను ప్రభాస్ చాలా ఆకతాయి వ్యక్తి అని చెప్పాను కానీ బాలకృష్ణ సార్, ప్రభాస్ కంటే పెద్ద ఆకతాయి అంటూ నయనతారు తెలిపింది. ప్రస్తుతం నయనతార నందమూరి బాలకృష్ణ పై చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -