Sonu Sood: సహాయాలు ఆపేసిన సోనూసూద్.. అసలు ప్లాన్ ఇదేనా?

Sonu Sood: సోనూసూద్ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈయన విలన్ గా ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితమే. ఇలా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను భయపెట్టిన సోనుసూద్ వ్యక్తిగత జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు తన మన అనే భేదం లేకుండా ఆపదలో ఉన్నటువంటి వారందరినీ ఆదుకున్నారు.

ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఇతర దేశాలలో ప్రాంతాలలో చిక్కుకున్న వారందరిని సొంత డబ్బులతో తమ సొంత గ్రామాలకు చేరవేశారు అలాగే ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేశారు.ఇలా కరోనా సమయంలో మొదలైన ఈయన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో సోను సూద్ తన సేవా కార్యక్రమాలను ఆపివేసారని తెలుస్తుంది.

 

ఇలా అందరికీ సహాయ సహకారాలు చేస్తూ నిజ జీవితంలో హీరోగా పేరు సంపాదించుకున్న సోనూసూద్ ఉన్న ఫలంగా ఇలా సేవ కార్యక్రమాలను ఆపివేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈయన ఎంతోమందికి సహాయం చేస్తూ బయట హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు ఇలా అందరి దృష్టిలో హీరోగా ఉన్నటువంటి సోనుసూద్ కి సినిమాలలో మాత్రం విలన్ పాత్రలను ఇచ్చి తనలో ఉన్నటువంటి రాక్షత్వాన్ని ప్రేక్షకులకు చూపించాల్సి వస్తుంది.

 

ఇలా అందరి మదిలో దేవుడిగా చోటు సంపాదించుకున్న సోను సూద్ ను విలన్ గా చూపించడానికి మేకర్స్ కూడా ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తుంది. అందుకే ఈయనకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని సమాచారం. ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతోనే సోను తన సేవా కార్యక్రమాలను కూడా తగ్గించారని తెలుస్తోంది. ఇది ఆయన కెరియర్ పై పూర్తి నెగిటివ్ ప్రభావాన్ని చూపించడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -