Balakrishna: బాలకృష్ణ మాస్ హీరో కావడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

Balakrishna: గత రెండేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో బాలయ్య నామస్మరణ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు జై బాలయ్య అన్నది ఒక స్లోగన్ గా కూడా మారింది. ఏ హీరో ఫ్యాన్స్ నోట విన్నా జై బాలయ్య అనే పదం వినపడక మానదు. ఈ సినిమా విడుదలైనా కూడా థియేటర్లలో జై బాలయ్య అనే స్లోగన్ కచ్చితంగా వినిపిస్తోంది. బాలయ్య మేనియా అంతలా మారిపోయిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది.

 

బాలయ్య వ్యక్తిత్వం మిగిలిన హీరోలతో పోల్చితే కాస్త భిన్నంగా ఉంటుంది. భోళా మనస్తత్వంలో బాలయ్య మెగులుగుతూ ఉంటాడు. తన మనసులో ఏం పెట్టుకుంటాడో అదే బయటకు చెబుతాడు. ఆయనలో దాపరికం అనేది అస్సలు ఉండదు. కొంత మంది హీరోలు తమను తాము హైప్ చేసుకుంటూ ఉంటారు. కానీ బాలయ్యలో అది ఎప్పుడూ కనిపించలేదు. తన సినిమా ఎంత లెవల్లో ఉందో, తన మార్కెట్ ఏ విధంగా ఉందో బాలయ్య దాపరికం లేకుండా చెప్పుకునేస్తాడు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోడు.

 

ఇప్పుడు కుర్ర హీరోల హవా నడుస్తోంది. కొన్ని దశాబ్దాలు అయినా ఇప్పటికీ బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. 1990 నుంచి బాలయ్య శకం ప్రారంభమైంది. ఏ తరహా పాత్రలు అయినా బాలయ్య అవలీలగా చేస్తారు. తాను ఎక్కువగా రౌద్ర రసం ఇష్టపడుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఆపదలో ఉంటే తాను కచ్చితంగా సాయం చేస్తానని హామీ ఇస్తాడు. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి సాయం అందించాడు. సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఉచితంగా చికిత్సను అందించాడు.

 

తాను చేసిన సాయం గురించి బాలయ్య ఎక్కువగా చెప్పుకోడు. సినీ ఇండస్ట్రీలో సామాన్యులు కూడా ఆయనకు మెస్సేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం ఆయన గుణం. బాలయ్య ముందు నుంచి కూడా నిర్మాతలకు మంచి చేయాలని చూస్తుంటాడు. నిర్మాత ఎంత ఇస్తానన్నా కూడా బాలయ్య కాదనకుండా సినిమా చేస్తాడు. దర్శకుడి పనిలో జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. డైలాగులు చెప్పడంలో బాలయ్య రూటే సపరేటు. అందుకే ఆయన స్టార్ హీరోగా నేటికీ రాణిస్తూనే ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -