YS Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?

YS Jagan: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి మనందరికీ తెలిసిందే. తరచూ రాజకీయాలలో జరిగే కాంట్రవర్సీలలో ఎక్కువగా కొడాలి నాని వేరే వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడుతూ వార్తలు నిలుస్తూ ఉంటారు కొడాలి నాని. మరి ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పై నాని ఎక్కువగా ఫైర్ అవుతుంటారు. వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు.

అందుకే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కాబినెట్ కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం నానికి మంత్రి పదవి రాబోతున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి.

 

అలానే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో మంత్రి వర్గంలో మార్పులు ఒకటి. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసింది. అయితే ఆ వార్తలు బలం చేకూర్చేలా ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేబినెట్ ప్రక్షాళన గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో అనూహ్యంగా మాజీ మంత్రులు కొందరు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అలానే ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఒకరిద్దరికి కూడా మంత్రి పదవులు ద‌క్కుతాయ‌ని సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కేబినేట్ లో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రిగా ఉన్న సమయంలో తన పనితీరుతో జగన్ మోహన్ రెడ్డి దగ్గర కొడాలి నాని మంచి మార్కులు కొట్టేసారు. అంతేకాకుండా ఆ ప్రతిపక్షాలు అయినా టీడీపీ, జనసేన పార్టీ లక విమర్శలకు కొడాలి నాని ధీటుగా సమాధానాలు ఇస్తారు. అలా తన మంత్రి పదవి కాలంలో కొడాలి నాని సీఎం దగ్గర మంచి గుర్తింపు సంపాదించారు. ఆ కారణంతోనే కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Girl Child: ఆడపిల్ల పుడితే 6000 రూపాయలు.. ప్రభుత్వం శుభవార్త ఇదే!

Girl Child: ప్రస్తుత రోజులో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టడం ఒక దరిద్రంగా శాపంగా భావిస్తున్నారు. దారుణం ఏంటంటే మగవారు మాత్రమే కాకుండా చాలా మంది స్త్రీలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.....
- Advertisement -
- Advertisement -