Niharika-Chaitanya: నిహారికకు చైతన్య విడాకుల వెనుక అసలు కథ ఇదేనా?

Niharika-Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా రిస్క్ చేసి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవటంతో జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.

వివాహం తర్వాత నిహారిక నటనకు దూరంగా ఉన్నప్పటికీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి నిర్మాతగా మారి వెబ్ సిరీస్ తో పాటు సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ విషయంలో నిహారికకు భర్త సపోర్ట్ కూడా ఉంది. ఇదిలా ఉండగా 2020 లో నిహారికా, చైతన్య వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటు వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

 

ఇలా వివాహం తరువాత నిహారిక పబ్ లో పట్టుపడటంతో చాలా కాలం మీడియాకి, సోషల్ మీడియాకి దూరం అయ్యింది. ఆ తరువాత కొంతకాలానికి సోషల్ మీడియాలో యాక్టివ్ అయినప్పటికీ ఒంటరిగా వెకేషన్స్ కి వెళ్ళటం, భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయకపోవటంతో ఇద్దరిమధ్య మనస్పర్ధలు వచ్చాయని ,ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా కుటుంబంలో శ్రీజ విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిహారికా విడాకుల వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

 

ఇలా మెగా కుటుంబానికి చెందిన ఆడపిల్లల విడాకుల వార్తలు వైరల్ కావటంతో మెగా ఆడపడుచులకు పెళ్లిళ్లు అచ్చిరావటం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నిహారిక, చైతన్య వివాహం జరిగి మూడూ సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఇలా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నారు. అయితే వివాహాం తరువాత నిహారిక ప్రవర్తన నచ్చకపోవడంతో చైతన్య ఆమెకు దూరంగా ఉంటున్నాడని, అందువల్ల సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు ఒక్కొక్కటిగా డెలీట్ చేస్తున్నాడని సమాచారం. అయితే నిహారిక విడాకుల వార్తలపై ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -