Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో రాణిస్తోంది. ఇప్పటివరకు నిహారిక పలు సినిమాలు, షోలల్లో నటించింది. అయితే నిహారిక బ్యాడ్‌లక్కో ఏంటో కానీ ఏ సినిమాలోనూ సక్సెస్ కాలేదు. హీరోయిన్‌గా సెట్ కాదని తెలుసుకున్న నిహారిక ప్రొడ్యూసర్‌గా అవతారమెత్తింది. జీ5లో ప్రసారమయ్యే ‘నాన్న కూచీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హల్లో వరల్డ్’ వెబ్ సిరీస్‌లకు ప్రొడ్యూసర్‌గా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత కూడా నిహారిక అదే పంథాతో దూసుకెళ్తోంది. అయితే మెగా డాటర్లు మాత్రం ఎప్పుడూ వివాదాల్లో ఇరుక్కోవడం కామన్. నిహారిక కూడా ఓ వివాదంలో చిక్కుకుంది. దాని నుంచి బయటపడ్డాక.. నిహారిక కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది.
ఈ మధ్యనే మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్ అయింది నిహారిక. ఇందులో తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చింది. నిహారిక.. ఇటీవలే తన స్నేహితులతో కలిసి టర్కీ వెళ్లింది. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో అందరి కళ్లు నిహారిక టాటూపై పడింది. ఎప్పుడూ లేని విధంగా నిహారిక వెకేషన్‌లో బికినీ ధరించి అందరికీ హీట్ పుట్టిస్తుంటే.. టాటూతో మరోసారి వార్తలో నిలిచింది. నిహారిక వీపు వెనుక భాగంలో ‘ఎన్‌కే’ అనే అక్షరాలతో వాటికి ఇరువైపులా సీతాకోకచిలుక రెక్కలు ఉన్నాయి. ఈ టాటూ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. అయితే ఎన్‌కే అంటే ‘నిహారిక కొణిదెల’ అని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ టాటూ ఇప్పుడు వేయించుకుంది కాదని.. ఐదేళ్ల క్రితమే టాటూ వేసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు.
బికినీ ధరించడం వల్ల టాటూ బయటపడిందని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట నిహారిక టాటూపైనే చర్చ జరుగుతోంది. కాగా, నిహారిక వెకేషన్‌కు వెళ్లిన ప్రతిసారి భర్త చైతన్య లేకపోవడం అందరిలో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భర్త లేకుండానే వెకేషన్ ఎంజాయ్ చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక మాత్రం స్నేహితులతో లైఫ్ ఎంజాయ్ చేస్తోందని చెప్పుకొస్తున్నారు.