Revanth: రేవంత్ విన్నర్ కావడం వెనుక అసలు కథ ఇదేనా?

Revanth: బుల్లితెర పాపులర్ షో అయిన బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా రేవంత్ నిలిచాడు. అందరూ అనుకున్నట్లుగానే సింగర్ ఎల్ వి రేవంత్ బిగ్ బాస్ 6 షో విన్నర్ గా 95 శాతం ఓటింగ్ తో అయ్యారు. ఇదే ముందే ఫిక్స్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా రేవంతే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి అంచనా వేస్తున్నారు.

 

బిగ్ బాస్ 6 టైటిల్ సాధించడానికి రేవంత్ మొదటి నుంచి ఎంతో కసిగా ఆటను ఆడాడు. కొన్ని సార్లు తప్పు ఒప్పులు కూడా మర్చిపోయి రేవంత్ ముందుకు సాగాడు. తన టార్గెట్ టైటిల్ విన్ అవ్వడమేనని తెలుసుకున్నాడు. అందుకే ఇచ్చిన ప్రతి టాస్క్ ను ఎంతో శ్రద్ధతో చేశాడు. అవతల ఉన్నది ఎవరైనా సరే తన ఆట తీరుతో నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాడు.

రేవంత్ విజయం సాధించడానికి అతని భార్య, అతని తల్లి కూడా ప్లస్ అయ్యారనే చెప్పాలి. రేవంత్ భార్య సీమంతం, బిడ్డ పుట్టడం అవన్నీ రేవంత్ కు కలిసి వచ్చాయి. అతను పండించిన ఎమోషన్ ఆడియన్స్ కు బాాగా కనెక్ట్ అయ్యింది. రేవంత్ మీద పాజిటివిటీ పెరిగేలా చేసింది. బిగ్ బాస్ లో ఎక్కువగా నామినేట్ అయ్యే కంటెస్టెంట్లే విన్నర్ అవుతారని అందరూ అనుకునేవారు. అలా చాలా మంది విజేతలుగా కూడా నిలిచారు. అయితే రేవంత్ విషయంలో అలా జరగలేదు.

 

సెప్టెంబర్ 4వ తేదీన మొదలైన బిగ్ బాస్ సీజన్6 లో మొత్తం 21 మంది సభ్యులు చేరారు. ఆ తర్వాత ఫైనల్ కి రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహన్ కీర్తిభట్ లు చేరారు. చివరికి టాప్ లో శ్రీహాన్, రేవంత్ నిలిచారు. ప్రైజ్ మనీ లో సగం అమౌంట్ ని రేవంత్, శ్రీహాన్ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్లచ్చని నాగార్జున తెలుపడంతో ఇద్దరూ వద్దన్నారు. ఆ తర్వాత ప్రైజ్ మనీని రూ.40 లక్షలకు పెంచడంతో శ్రీహాన్ హౌస్ మేట్స్ మెజార్టీ మెంబర్స్ పాటు పేరెంట్స్ కూడా డబ్బులు తీసుకోమని సూచించారు. దీంతో శ్రీహాన్ ఆ డబ్బులు తీసుకున్నాడు. అయితే టైటిల్ విన్నర్ మాత్రం రేవంతే అయ్యాడు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -