CM Jagan: జగన్ లో వచ్చిన మార్ప్ వెనుక అసలు కథ ఇదేనా?

CM Jagan: సాధారణంగా చాలా వరకు జగన్ బహిరంగ సభలో ఎక్కడైనా స్పీచ్ ఇచ్చినప్పుడు తాను ప్రవేశపెట్టిన పథకాల గురించి చర్చించడంతోపాటు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో జగన్ మాట్లాడిన తీరు ప్రవర్తించిన చిరు పార్టీ నేతలతో పాటు జనాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఏపీ సీఎం జగన్ తాజాగా దెందులూరు లో నిర్వహించిన ఆసరా పథకం బటన్ నొక్కుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ జగన్ పద్ధతిగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం డబ్బులను ఇస్తున్నామని కానీ వాటిని మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారు అనేది ఎవరికి చెప్పాల్సిన పనిలేదు జగన్.

ఆ విషయం గురించి తాను కూడా అడగను అని తెలిపారు. అలాగే మహిళలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వ శాయశక్తుల కృషి కృషి చేస్తోంది అని చెప్పుకొచ్చారు సీఎం జగన్. అదేవిధంగా ప్రజల కోసం ఆసరా, చేయూత, జీరో వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు.. అంతేకాకుండా గత పాలకుల కంటే మెరుగైన విధానాలు తీసుకొచ్చి దేశానికే పొదుపు సంఘాల మహిళలను ఆదర్శంగా నిలబెట్టామని తెలిపారు. పొదుపు సంఘాల పురోభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన విధానాలను ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలిస్తున్నాయని అని వెల్లడించారు సీఎం జగన్. అలాగే ఎప్పటికప్పుడు బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారం మహిళల పై పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు.

వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా మూడవ విడతగా 78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వివరించారు. 10 రోజుల పాటు ఏపీలో ఆసరా పంపిణీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. అయితే అక్క చెల్లెమ్మలంతా అండగా ఉండాలని కోరారు. అక్కచెల్లెమ్మలు ఉన్నారన్న ధైర్యంతోనే ముందడుగు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్పీచ్ మొత్తం మీద గత ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ఇవ్వలేదని డ్వాక్రా మహిళలు రుణాల ఊబిలో ఇరుక్కున్నారని అన్నారు. కానీ రాజకీయంగా మాత్రం ఇతర ఆరోపణలు చేయలేదు. మామూలుగా అయితే ఆయన మీ బిడ్డనంటూ సెంటిమెంట్ డైలాగ్ ని వేస్తూ ఉంటారు. దుష్ట చదుష్టయం అని మీడియా నేతల మీద విరుచుకుపడతారు.

తాను సంగిల్ సింహాన్ని అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటారు. ఒంటరిగా వచ్చే దమ్ముందా అంటూ అనే సవాల్ కూడా చేస్తారు. రాజకీయ విమర్శలతో ప్రసంగం చేసేవారు. కానీ తాజాగా మాత్రం ఆయన వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ తీరు మారిపోవడంతో వైసీపీ నేతలు తమ బాస్ కు గట్టి షాక్ తగిలినట్లుందే అనుకోవడం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తన మాటను కాదని ఎమ్మెల్యేలు జారిపోవడం, ఎమ్మెల్సీగా మరో అభ్యర్థిని పెట్టినా గెలిచేవారని చంద్రబాబు వ్యాఖ్యానించిన అంశం జగన్ కు ఇబ్బందికరంగా మారిదందని అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు తమ పట్ల పార్టీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ సమయంలో జగన్ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయం పట్ల వైసీపీ నేతలు కాస్త ఆలోచనలు పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -