Tollywood: ఈ టాలీవుడ్ స్టార్స్ సినిమాలు డిజాస్టర్స్ కావడం వెనుక అసలు కథ ఇదేనా?

Tollywood: టాలీవుడ్ యంగ్ ఈ హీరోలకు ఈ మధ్య కాలంలో వరస ప్లాప్ లు వెంటాడుతున్నాయి. ఏదో ఒకరు ఇద్దరు హీరోలకు తప్ప మిగిలిన హీరోలందరికీ డిజాస్టర్లే మిగులుతున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ నుంచి అఖిల్ సినిమా వరకు ఇలానే జరుగుతున్నాయి. అయితే ఈ ప్లాప్ ల వెనుక పెద్ధ కథే ఉందని అంటున్నారు. అదేందో ఇప్పుడు చూద్దాం తెలుగు సినిమా అంటే చాలు.. ఫైట్లు ఇరగదీయాలి.

పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలి. నాగ్ లాంటి సీనియర్లకు 60 ఏళ్లు దాటేసినా ఇంకా 18ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేయాలి. యాక్షన్ సీన్లు వుండాలి. కానీ రోజులు మారాయి.జనాలకు ఓ అభిరుచి ఉంటుంది. ఒక్కో హీరోను ఒక్కో విధంగా చూస్తారని అస్సలు అనుకోరు. రోటీల్ కథలనే తీస్తారు. లేదంటే పక్క ఇండస్ట్రీల నుంచి అరువు తెచ్చుకుంటారు.

 

యంగ్ హీరోలు విభిన్నమైన ప్రేమకథలు చేసినపుడల్లా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు బోలెడన్ని చూశాం. నితిన్ ఎన్నో మాస్ సినిమాలు చేసాడు. అన్నీ తిప్పి తిప్పి కొట్టారు. ఇష్క్ అలాగే ఆ తరువాత వచ్చిన రెండు మూడు సినిమాలు అద్భుతాలు చేసినా చేయకున్నా మాచర్ల రేంజ్ డిజాస్టర్లు కాలేదు.

 

ఏమాయచేసావె, ప్రేమమ్, మజిలీ రారండోయ్ వేడుక చూద్దాం, లవ్ స్టోరీ, మజిలీ ఇలా ఎన్ని హిట్ లు హిట్. సవ్యసాచి, సాహసం శ్వాసగా, యుద్దం శరణం, వెంకీ మామ ఇవన్నీ నాగ్ చైతన్యకు ఫ్లాపులే. ఇక్కడ తెలియడం లేదా తనను జనం ఏ తరహా సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారని.. అవే జోనర్ లో విభిన్నమైన కథలు సంపాదించాలి.

 

ఇకనైనా హీరోలు ఈ మాస్ ప్రయోగాల విషయంలో కాస్త ముందు వెనుక ఆలోచించాలి. నిర్మాతలను బలి చేయడం ఆపాలి. ఎందకంటే ఈ మధ్య సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒక్క సినిమా ప్లాప్ అయినా నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒకటి అర హీరోలు మాత్రమే సినిమా ప్లాప్ అయితే కొంత డబ్బు వెనక్కి ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -