Devotional: పిల్లలకు తలవెంట్రుకల తీయడం వెనుక ఉన్నా కారణం ఇదే?

Devotional: భారతదేశం ఎన్నో ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. టెక్నాలజీ మారినా కూడా భారత దేశంలో మరి ముఖ్యంగా హిందువులు ఇప్పటికీ ఎన్నో రకాల ఆచార సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. కొందరు మూఢనమ్మకాలు అని కొట్టి పరేగా మరికొందరు మాత్రం వాటిని పాటిస్తూనే ఉంటారు. ఇకపోతే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల వెంట్రుకలు ఎన్నో సందర్భాలలో తీసేస్తూ ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు, దేవుళ్లకు మొక్కుబడి ఉన్నప్పుడు ఇతర సందర్భాలలో తలపై వెంట్రుకలను తీసేస్తూ సమర్పిస్తూ ఉంటారు.

పిల్లలు పుట్టిన 6 లేదా 9 నెలలకు పుణ్యక్షేత్రాలకు, దేవాలయాలకు వెళ్లి గుండు కొట్టిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. చిన్నారి మేనమామ మొదటగా కొన్ని వెంట్రుకలు కత్తిరిస్తాడు. అనంతరం వారికి పూర్తి గుండు కొట్టిస్తారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి, వంటి పుణ్య క్షేత్రాల్లో ఈ పుట్టు వెంట్రుకలు తీయు కార్యక్రమాలు అధికంగా చేస్తుంటారు. చిన్నారులకే ఎందుకు గుండు కొట్టిస్తారో తెలుసా..? ఈ ప్రశ్న చాలా మందికి కలిగే ఉంటుంది. మరి చిన్నారులకు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక సైన్స్ దాగి ఉంది. పిల్లలకు తల వెంట్రుకలు తీయడం చాలా ముఖ్యమైన విషయం.

 

తల్లి తొమ్మిది నెలలు గర్భంలో ఉండి లోకానికి వచ్చాక వారి తలమీద సూక్ష్మక్రిములు ఉంటాయి. తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా ఆ క్రిములు మాత్రం తొలగించలేము. షాంపు తో స్నానం చేసినా ఆ క్రిములు పోవు. అందుకే తలమీద వున్న వెంట్రుకలను కట్ చేస్తారు. దీంతో ఆ క్రిములు పూర్తిగా వెళ్ళిపోతాయి. పిల్లలకు శిరోముండనం చేస్తే వారి శరీర ఉష్ణోగ్రతలు కూడా నియంత్రణలో ఉంటాయి. గుండు చేయించడం ద్వారా కురుపులు, మొటిమలు, విరేచనాలు వంటి వ్యాధులు పూర్తిగా పిల్లల నుండి దూరంగా వెళ్ళిపోతాయి. హిందువులు అధికంగా గుండు చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే తల మీద వెంట్రుకలు లేకపోతే సూర్యరష్మీ తలమీద పిల్లలకు నేరుగా తగిలి మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. సిరల్లో రక్తప్రసారణ బాగా జరిగుతుంది. పిల్లలకు గుండు చేస్తే దంతాలు చాలా సులభంగా వస్తాయట.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -