Naga Chaitanya-Samantha: నాగచైతన్యతో విడిపోవడానికి కారణం ఏంటో చెప్పిన సమంత

Naga Chaitanya-Samantha: అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని తెలుగు ఇంటి కోడలుగా మారింది హీరోయిన్ సమంత. తెలుగులో ‘ఏమాయ చేసావే’ అంటూ ఇద్దరూ అదరగొట్టగా.. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చాలా సంవత్సరాల పాటు కొనసాగగా.. పెళ్లి చేసుకున్నారు. ఎంతో అట్టహాసంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుక అందరికీ కనువిందు చేసింది.

కానీ ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య ఏం జరిగిందేమో విడిపోతున్నట్లు సమంత, నాగచైతన్యలు ప్రకటన విడుదల చేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని అనుకున్న వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు విడిపోయారనే చర్చ సర్వత్రా జరిగింది. వీరిద్దరు విడిపోయి ఏడాది గడుస్తున్నా ఎందుకు విడిపోయారనే విషయంలో స్పష్టత మాత్రం రాలేదు.

తాజాగా సమంత అమెరికాలోని మాజీ అత్తగారైన అక్కినేని నాగచైతన్య వాళ్ల అమ్మ గారిని కలిశారట. నాగచైతన్య నుుండి ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే విషయం మీద ఆమెకు క్లారిటీ ఇచ్చిందట. సమంతను కంట్రోల్ చేయాలని నాగచైతన్య అనుకున్నాడని, గ్లామరస్ పాత్రల విషయంలోనే కాదు, డ్రెస్సింగ్ విషయంలో కూడా నాగచైతన్య కంట్రోల్ చేయాలని చూశాడట.

సమంతకు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ విషయంలో కూడా నాగచైతన్య అభ్యంతరాలు చెప్పే వాడని, మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని కూడా అనేవాడట.ఈ విషయం పై ఇద్దరికి చాలా సార్లు గొడవ జరిగినా..చైతన్య మాత్రం మారలేదట. భర్త అనే అహంకారం చూపించే వాడని, ఒక రకంగా సమంతను ఇబ్బంది పెట్టే వాడని సమంత తన మాజీ అత్తతో అన్నట్లు సమాచారం. కాగా వీరిద్దరు విడిపోవడం, అది కూడా ఈగో విషయంలో విడిపోవడం ఆశ్చర్యం కలిగించిందట.

Related Articles

ట్రేండింగ్

Viveka Murder Case: వివేకా గురించి మాట్లాడొద్దు… జగన్‌ రాయి దాడి గురించి మాట్లాడొచ్చు.. ఇవేం రూల్స్ అంటూ?

Viveka Murder Case: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైయస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం కోసం వైఎస్ అవినాష్ రెడ్డిని దోషిగా చూపెడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి...
- Advertisement -
- Advertisement -