Varasudu: వారసుడు మూవీ రిలీజ్ డేట్ మార్పు వెనుక కారణమిదేనా?

Varasudu: సంక్రాంతి వస్తోందంటే చాలు సినిమాల పండగ మొదలైనట్లే. 2023 సంక్రాంతికి కూడా ఈ సందడి కొనసాగనుంది. జనవరి 12వ తేదిన తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. నిన్నే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అయితే నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను దిల్ రాజు మార్చేశాడు.

జనవరి 12వ తేదికంటే ఒక రోజు ముందే అంటే 11న వారసుడు సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అజిత్ తెగింపే దీనికి కారణం అని తెలుస్తోంది. అజిత్ చేస్తున్న తెగింపు సినిమాను 11వ తేది విడుదల చేయనున్నట్లు ఆ సినిమా నిర్మాత అయిన బోనీ కపూర్ ప్రకటించారు. దీంతో విజయ్ సినిమాను కూడా అదే డేట్ కి విడుదల చేయనున్నట్లు దిల్ రాజ్ వెల్లడించాడు.

హీరోలు అజిత్, విజయ్ డబ్బింగ్ సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించి తెలుగులో అంతగా ప్రమోషన్స్ హడావిడి జరగడం లేదు. నిర్మాతలు కూడా తెలుగుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. నిర్మాతల ఫోకస్ అంతా తమిళంపైనే ఉందని తెలుస్తోంది. అయితే వారసుడు సినిమా నిర్మాత దిల్ రాజు కావడం వల్ల ఆయన చేతిలో చాలా థియేటర్స్ వుండటం వల్ల ఆయన కొంత హడావుడి చేస్తున్నాడు.

తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కంటే ఎక్కువ థియేటర్స్ వారసుడికి వెళ్లాయని సమాచారం. ఇప్పుడు ఆ సినిమా డేట్ ముందుకి జరగడం వల్ల సంక్రాంతి సినిమాల్లో రెండు డబ్బింగ్ సినిమాలే ముందుగా ప్రేక్షకులను అలరించనున్నాయి. చేతిలో థియేటర్స్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ కు ఏ ఢోకా ఉండదని దిల్ రాజు నమ్ముతున్నాడు. అజిత్ తెగింపు సినిమా విషయానికి వస్తే దానిని ఎవ్వరైనా చూస్తారనే నమ్మకం ఉంది. మరి తెలుగు బాక్సాఫీసు వద్ద డబ్బింగ్ సినిమాలు ఏవి గెలుస్తాయో చూడాలంటే వేచిచూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -