Allu Arjun: బన్నీతో ఆ డైరెక్టర్ సినిమా చేయకపోవడానికి రీజన్ ఇదేనా?

Allu Arjun: పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో ఆయన ఇండియాస్ మోస్ట్ పాపులర్ స్టార్ గా మారారు. ‘పుష్ప’ ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అంతకుముందు టాలీవుడ్, మాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఐకాన్ స్టార్ క్రేజ్.. ‘పుష్ప’తో ఒక్కసారిగా పాన్ ఇండియా వ్యాప్తమైపోయింది.

 

బాలీవుడ్ లో ‘పుష్ప’ హిట్ అనూహ్యంగా జరిగిందని కొందరు అంటున్నారు. కానీ హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల్లో బన్నీకి ఎప్పుడో క్రేజ్ ఏర్పడింది. యూట్యూబ్ లో ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకు వచ్చిన వ్యూసే దీనికి నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటిది ఒక్కసారిగా బిగ్ స్క్రీన్లలో అల్లు అర్జున్ కనిపించడంతో హిందీ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ‘పుష్ప’ను బిగ్గెస్ట్ హిట్ చేశారు. వాళ్ల ఆదరణతోనే ఈ మూవీ అక్కడ రూ.100 కోట్లకు పైనే కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

 

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఉన్న అంచనాలను అందుకునే నేపథ్యంలో సుకుమార్ ఈ మూవీని మరింత పకడ్బందీగా చిత్రీకరిస్తున్నారు. బన్నీ కూడా ప్రతి విషయంలోనూ మరింత కేర్ తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ తో ఓ టాప్ దర్శకుడు ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా తీయలేకపోయారు.

 

అందుకే బన్నీతో తీయట్లేదా..?
ప్రస్తుతం బన్నీతో సినిమా తీసేందుకు అందరు దర్శకులు ఎగబడుతున్నారు. ఆయన మీద పెట్టుబడి పెడితే డబుల్ ప్రాఫిట్స్ రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఆయనతో ఓ టాప్ డైరెక్టర్ మాత్రం సినిమా తీసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. బన్నీ గురించి రాంగ్ ఒపీనియన్ ఉండటం వల్లే ఆ డైరెక్టర్ ఇలా చేశారని సమాచారం. అల్లు అర్జున్ కు పొగరు ఎక్కువనే ఉద్దేశంతోనే ఆ దర్శకుడు ఇలా చేస్తున్నారని వినికిడి. ఆ డైరెక్టర్ ఎవరనేది బన్నీ ఫ్యాన్స్ కే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -