Tarakaratna: తారకరత్న మృతి విషయంలో ట్విస్ట్ ఇదేనా.. ఏం జరిగిందంటే?

Tarakaratna: నందమూరి తారకరత్న జనవరి 27వ తేదీ నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఉన్నఫళంగా గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. జనవరి 27న గుండె పోటుకు గురైన ఇతను ఫిబ్రవరి 18 వ తేదీ మరణించిన విషయం తెలిసిందే. ఇలా తారకరత్న మరణించడంతో నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే నందమూరి తారకరత్న మరణంలో సందేహాలు ఉన్నాయి అంటూ తాజాగా కేఏ పాల్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తారకరత్న గుండెపోటు వచ్చిన రోజే మరణించారని అయితే ఆరోజే తన మరణాన్ని ప్రకటిస్తే లోకేష్ పాదయాత్ర పై నెగిటివ్ ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆయన మరణాన్ని 23 రోజులపాటు దాచి పెట్టారని, తారకరత్న మృతిపై వైసీపీ నేతలు అలాగే నందమూరి లక్ష్మీపార్వతి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

 

తాజాగా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధర్నా చేస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న మరణం గురించి కేఏ పాల్ మాట్లాడుతూ తనకు తారకరత్న మరణ విషయంలో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తారకరత్న మొదటి రోజు మరణించారని కానీ కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం ఈ విషయాన్ని దాచిపెట్టారు అందుకే సిబిఐ ఎంక్వయిరీ వేయాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు.

 

తాము సిబిఐను ఏ విషయం అడగడం లేదని ఒక వ్యక్తి ఎప్పుడు మరణించారనే విషయాన్ని మాత్రమే మాకు తెలియజేయాలి అంటూ కేఏ పాల్ డిమాండ్ చేయడంతో పలువురు తారకరత్న మరణం గురించి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే తారకరత్న మొదటి రోజు మరణించారా లేక ఫిబ్రవరి 18వ తేదీన మరణించారా అనే విషయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -