Husband And Wife: వయస్సు పెరిగిన మహిళలు భర్త నుంచి కోరుకునేది ఇదేనా?

Husband And Wif: సాధారణంగా వివాహం జరిగిన తర్వాత మహిళలు అన్ని విషయాలలో తన భర్త తనకు అండగా ఉండాలని కోరుకుంటారు. అయితే పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు. ఎందుకంటె పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం వల్ల తల్లిదండ్రులుగా వారి భాధ్యత పెరుగుతుంది. అయితే పిల్లలు పెరిగి పెద్దయి వారి కాళ్ళ మీద నిలబడే వయసు వచ్చేసరికి తల్లితండ్రుల వయసు 40 సంవత్సరాలు దాటిపోతుంది. అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మహిళా కూడా తన భర్త తనతో ఇలా ఉండాలని కలలు కంటూ ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన మహిళలు తమ భర్త నుండి ఏం కోరుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మహిళలకు 40 సంవత్సరాలు దాటేసరికి శరీరాకృతిలో మార్పు ఉంటుంది. మహిళలు బరువెక్కడం వల్ల అంద విహీనంగా కనిపిస్తారు. దీంతో భర్త ఇతర మహిళలో మోజులో పడి భార్యను నిర్లక్ష్యం చేస్తాడు. అంతే కాకుండా భార్యను ఇతరులతో పోల్చి అవమానిస్తూ ఉంటారు. అయితే భర్త ఇలా ఇతరుల మోజులో పడి తనను అవమానించటం భార్య ఏమాత్రం సహించదు. తనను పరాయి స్త్రీలతో పోల్చి చూడకూడదని భార్య కోరుకుంటుంది.

 

అలాగే మహిళలకు 40 సంవత్సరాలు దాటేసరికి పిల్లలు ఉన్నత చదువుల కోసం దూర ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకాలం ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలతో బిజీగా ఉండే మహిళలు పిల్లలు చదువుల కోసం దూరంగా వెళ్లడంతో ఒంటరిగా ఫీల్ అవుతారు. అందువల్ల తన భర్త తనకు తోడుగా ఉంటు తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటారు.. అలాగే ఆ సమయంలో మహిళలకు శృ**ర జీవితంపై కూడా కోరిక పుడుతుంది.

 

అలాగే 40 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల భవిషత్తు కోసం భర్త మరింత శ్రమించాల్సి ఉంటుంది. పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో భార్య గురించి శ్రద్ధ తీసుకునే సమయం వారికి ఉండదు. అంతేకాకుండా 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమంది భర్తలకు వారి భార్యల పట్ల ఇష్టం తగ్గుతుంది. అయితే అటువంటి సమయంలో మహిళలు వారి భర్త ప్రేమ కోసం ఆశపడతారు. తన భర్త తనతో ప్రేమగా గడపాలని కోరుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Blind Man: చూపు లేకపోయినా ఈ యువకుడు సాధించిన సక్సెస్ కు ఫిదా కావాల్సిందే!

Blind Man: ఈ రోజుల్లో కొంతమంది మనుషులకు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా పనిచేయడానికి కష్టపడడానికి బద్ధకం చూపిస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించడం కోసం తప్పుడు మార్గాలని ఎంచుకుంటూ ఉంటారు. అటువంటి...
- Advertisement -
- Advertisement -