Varun Lavanya: వరుణ్ లావణ్య ఆరోజే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారా?

Varun Lavanya: మెగా ప్రిన్స్ మ్యారేజ్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు పండగ చేసుకునే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఎప్పటినుంచో డేటింగ్ లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలోనూ, పలు వెబ్సైట్లోనూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

వాటి మీద అటు లావణ్య కానీ ఇటు వరుణ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే వరుణ్ త్వరలోనే పెళ్లి ఎక్కబోతున్నాడంట. జూన్ 9న హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. అయితే ఆ రోజే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారా లేకపోతే డేట్ లో మార్పులు ఏమైనా ఉన్నాయా అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.

 

పైగా ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులే వెల్లడించినట్లు పేర్కొంది. బహుశా ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉండొచ్చని కూడా పేర్కొంది. ఈ వేడుకలకు మెగా కుటుంబంతో పాటు అటు అల్లు అర్జున్ కుటుంబం కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ఇటీవలే నాగబాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని స్పష్టంగా చెప్పాడు. వరుణ్ తేజ్, లావణ్య ల ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించగా ఇప్పుడే తానేమి చెప్పలేనని బదులిచ్చాడు నాగబాబు. పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ అన్ని వరుణ్ తేజ్ ప్రకటిస్తాడని చెప్పారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వేరే ఇంట్లో ఉంటాడని తన బిడ్డలకు ప్రవేశ ఇవ్వటం తనకి అలవాటని చెప్పుకొచ్చారు నాగబాబు.

 

ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీధారి అర్జున సినిమాలో నటిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన ప్రేమ విషయానికి వస్తే శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు అప్పటినుంచి ఈ జంట పార్టీలకి కలిసే వెళ్తోంది. నిహారిక పెళ్లిలో కూడా లావణ్య త్రిపాఠి తెగ హడావిడి చేసింది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -