TDP Twitter Account Hack: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ హ్యాక్.. అధికార వైసీపీ కుట్ర ఉందా?

TDP Twitter Account Hack: ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ మళ్లీ హ్యాక్ కు గురైంది. ఈ ఏడాది మార్చిలో ఒకసారి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ను అగంతకులు హ్యాక్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురి అయింది. ఈ ఏడాదిలోనే ఇప్పటికే రెండుసార్లు టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురి కావడం విశేషం. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైనట్లు టీడీపీ ఐటీ వింగ్ అయిన ఐటీడీపీ తన అధికారిక ట్వట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

వైసీపీకి మద్దతుదారులు ఈ పని చేసినట్లు ఐటీడీపీ ఆరోపణలు చేసింది. అకౌంట్ ను తిరిగి వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ అధికార ట్విట్టర్ అకౌంట్ పేరు టైలర్ హాబ్స్ గా మారింది. కానీ హ్యాడిల్ పేరు మాత్రం జై టీడీపీ అని ఉంది. దీంతో హ్యాకర్లు ట్విట్టర్ అకౌంట్ నేమ్ మార్చగా.. హ్మాడిల్ నేమ్ మాత్రం అలాగే ఉంచారు. దీంతో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైనట్లు బయటపడింది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ లో విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి. అలాగే ట్వట్టర్ అకౌంట్ డిస్క్రిప్షన్ ను కూడా మార్చేశారు. ట్విట్టర్ తెలుగుదేశం పార్టీ అని సెర్చ్ చేస్తే తెలుుదేశం పార్టీ అధికార ట్విట్టర్ అకౌంట్ కనిపిస్తూ ఉంటుంది.

కానీ ఇప్పుడు హ్యాక్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే ఆ పేరు కనిపించడం లేదు. టైలర్ హాబ్స్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ కనిపిస్తుంది. అయితే రెగ్యూలర్ గా టీడీపీ అకౌంట్ ను ఫాలో అయ్యేవారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. టీడీపీ ఐటీ వింగ్ ఐటీడీ వెంటనే అలర్ట్ అయింది. త్వరలోనే అకౌంట్ ను తిరిగి పునరుద్దరిస్తామని, ట్విట్టర్ కు కంప్లైట్ పెడతామని తెలిపింది. హ్యాక్ చేసిన వారు ట్విట్టర్ లో అసభ్యకర మెస్సేజ్ లు పంపినట్లు స్పష్టం చేసింది. అయితే అకౌంట్ కు ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం తెలిపింది. అయితే ఇది వైసీపీ పార్టీ పనేనని, మిగతా వారికి టీడీపీ పార్టీ అకౌంట్ ను హ్యాక్ చేసే అవసరం ఉండదని తెలిపింది.

అయితే నాలుగు నెలల క్రితం ఇలాగే టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో నారా లోకేష్ స్వయంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ హ్యాక్ కావడం టీడీపీ వర్గాలను కలవరపెడుతోంది. ఇది ఖచ్చితంగా వైసీపీ మద్దతుదారుల పనే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -