Nani: నాని మహా ముదురే కదా.. ఆమెతో ఆ పని చేయాలని చెబుతూ?

Nani: అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తరువాత అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవటంతో నాచురల్ స్టార్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు . నాని నటించిన సినిమాలు అన్ని దాదాపుగా మంచి విజయం అందుకున్నాయి. ఇక తాజాగా నాని నటించిన ‘ దసరా ‘ సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం, హిందీ అన్ని భాషలలో విడుదల చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం నాని కూడా చాలా కష్టపడ్డాడు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమా సక్సెస్ చేయటానికి నాని సినిమాని ప్రమోట్ చేశాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో నాని పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యు లో నాని మాట్లాడుతూ ఆ బాలీవుడ్ హీరోయిన్ గురించి తన మనసులో మాటలు బయటపెట్టాడు.

 

బాలీవుడ్ హీరోయిన్స్ లో మీకు ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నకు నాని స్పందిస్తూ.. బాలీవుడ్ లో దీపికా పదుకొణె అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని, ఆమె ఒక అద్భుత‌మైన న‌టి అంటూ దీపికా పదుకునే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ఆమెతో ఒక‌సారైనా క‌లిసి నటించాలని ఉందంటూ తన కోరిక‌ను కూడా బ‌య‌ట‌పెట్టేశాడు. అలాగే బాలీవుడ్ హీరోలలో ఎవరూ అంటే ఇష్టం అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ..

 

ఆమీర్ ఖాన్(Aamir Khan) అని చెప్పాడు. ఆమీర్ ఖాన్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తానని నాని చెప్పుకొచ్చాడు. అలాగే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించే సినిమాలంటే త‌న‌కెంతో న‌చ్చుతాయ‌ని, ఆయనతో కలిసి పనిచేయాలని ఉంద‌ని నాని తెలిపాడు.మ‌రి నానికి వీరితో క‌లిసి వ‌ర్క్ చేసే అవ‌కాశాలు వస్తాయో లేదో చూడాలి మరి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -