Diabetes: మధుమేహం ఉన్న వారు ఏ సమయంలో వ్యాయామం చేయాలో తెలుసా?

Diabetes: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. దీని బారిన పడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే భారత్‌ ఈ వ్యాధితో బారిన పడే వారి సంఖ్యంగా క్రమంగా పెరిపోతోంది. అయితే ఇది ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలు కూడా అధికమని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి తీసుకునే ఆహారం,  ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆహారంతో పాటు నిద్ర కూడా ఎంతో అవసరమని నిపుణులు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

మధుమేహంతో బాధపడే వారు కంటి నిండ నిద్రపోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం ఇంకా మంచిదని సూచిస్తున్నారు. భోజనం తర్వాత 5 నిమిషాలు చేసే చిన్నపాటి వ్యాయామం షుగర్‌లో కంట్రోల్‌ చేస్తోందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఉదయం లేదా సాయంత్రం చేసే వ్యాయామం వారి ఆరోగ్యానికి చాలా రేట్లు మంచిదని పలు అద్యాయానాల్లో వెల్లడైంది. రోజంతా నడవడం భోజనం తర్వాత ఐదు నిమిషాల వ్యాయామం చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మధుమేహం వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మంచి ఫలితాలను అందిస్తుందనేది అధ్యయనాలు చెపుతున్న మాట. ఉదయం వ్యాయామం చేసే వారితో పోల్చుకుంటే మధ్యాహ్నం మితమైన శారీరక శ్రమ చేసేవారిలో ఇన్సులిన్ నిరోధకత 18 శాతం వరకూ తగ్గింది. సాయంత్రం వ్యాయామం చేసేవారిలో ఇది తగ్గిందని ఓ పరిశోధనలో వెల్లడైంది.   ఉదయం 40 నుంచి 45 నిమిషాల కఠినమైన వ్యాయామాన్ని చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే షుగర్‌ను కంట్రోల్‌ చేస్తోంది.  మధుమేహంతో బాధపడేవారు మాత్రమే ఈ నియమాన్ని పాటించి వ్యాయామం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -