Health Tips: ఒబేసిటీ నుండి డయాబెటిస్ వరకు అన్నీ దీనితో మాయం!

Health Tips: ప్రతి రోజూ ఉదయం పాలు లేదా టీ, కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలలో బెల్లం, లేదా చక్కెర కలుపుకొని తాగడం కొందరికి అలవాటుగా ఉంటుంది. మరికొందరికి పాలలో పసుపు, మిరియాలు, ఖర్జూరాలు లాంటివి కలుపుకొని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

 

పాలలో ఈసబ్ గోల్ కలుపుకొని తాగితే ఊబకాయం సమస్య నుంచి బయట పడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈసబ్ గోల్ అనేది గోధుమలా కనిపిస్తుంది. ఇది చిన్నపాటి ఆకులు, పువ్వులతో ఉంటుంది. ఈ రకమైన మొక్క కంకులపై ఉండే విత్తనాలను ఓ తెల్లటి పదార్థం అంటుకొని ఉంటుంది. దాని పేరే ఈసబ్ గోల్. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఈసబ్ గోల్ లో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. దీన్ని పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, మూత సంబంధిత సమస్యలు, మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఉపాయంగా పని చేస్తుందనడంలో సందేహం లేదు.

 

కొవ్వు ఇట్టే కరిగిపోవాల్సిందే..
పాలలో కలుపుకొని ఈసబ్ గోల్ ను క్రమం తప్పకుండా వాడితే శరీరంలోని కొవ్వు ఇట్టే కరిగిపోవాల్సిందే. సన్నగా, నాజూగ్గా తయారవుతారు. అంతేకాకుండా కడుపునొప్పి, విరేచనాల సమస్య కూడా తగ్గిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇటీవలి కాలంలో డయాబెటిస్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విరుగుడుగా పాలు, ఈసబ్ గోల్ కాంబో తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -