మంకి పాక్స్, కోవిడ్, హెచ్ఐవి ఒకేసారి వచ్చాయ్.. ప్రస్తుతం ఎలా ఉందంటే?

గత రెండు మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను గడగడ లాడించిన విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత దేశ వ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా మంకీ ప్యాక్స్ వైరస్ కొద్ది రోజులపాటు హల్ చల్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు వైరస్ ల బారిన ఎక్కడ పడతామో అన్న భయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికారు. ఇకపోతే హెచ్ఐవి విషయం గురించి నీ వ్యాధి ఎప్పటినుంచో ఉన్న విషయం తెలిసిందే.

ఈ హెచ్ఐవి వ్యాధి కంటే మంకీ పాక్స్, కరోనా వ్యాధులు భయంకరమైనవి అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటిది ఈ మూడు వైరస్ లు కలిసి ఒకటేసారి అటాక్ చేస్తే అటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడానికి భయంగా ఉంది. తాజాగా ఇటలీలోనే ఒక వ్యక్తికి ఒకేసారి మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవి సోకినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ఆ వ్యక్తి ఐదు రోజుల పర్యటన తరువాత స్పెయిన్‌ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో బాధపడ్డాడట. అలా జ్వరం తల గొంతు నొప్పులతో తొమ్మిది రోజులపాటు బాధపడ్డాడట. అంతేకాకుండా అతని ప్రైవేట్‌ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్‌ లతో కూడా బాధపడ్డాడట.

అంతేకాకుండా అతని చర్మంపై దద్దుర్లు, అలాగే పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయి అని వైద్యులు తెలిపారు. దాంతో వెంటనే అతనిని వైద్యులు అత్యవసర ఇన్ఫెక్షన్ విభాగానికి తరలించి చికిత్స అందించడం మొదలు పెట్టారట. ఈ క్రమంలోనే మొదట అతనికి మంకీపాక్స్‌, కరోనా, హెచ్‌ఐవీ ఇలా 3 టెస్టులు చేయగా 3 కూడా రిపోర్టుల్లో పాజిటివ్‌ అని తేలిందట. అయితే ఇలా ఒక్కసారిగా మూడు వ్యాధులు ఎటాక్‌ అయిన తొలికేసు ఇదేనని వైద్యులు వెల్లడించారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ కూడా సోకిందని తేలిందట. దీంతో అతనికి కోవిడ్‌ సంబంధించిన వ్యాక్సిన్‌లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్‌, మంకీపాక్స్‌ నుంచి బయటపడి కోలుకున్నాడని, అలాగే అతను ఎయిడ్స్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -