Italy PM: ఇటలీ ప్రధానమంత్రి ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి సంచలనాలను రేకెత్తించాయో మనకు తెలిసిందే. ఈయన యువతీ యువకులను ఉద్దేశిస్తూ బయటకు వెళ్లి అతిగా తాగి స్పృహ లేకుండా ఉండటం వల్ల ఎన్నో రకాల అపాయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ చెప్పారు అయితే ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
బయటకు వెళ్లినప్పుడు స్పృహ లేకుండా తాగటం వల్ల ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలను నివారించాలి అంటే మీరు స్పృహలో ఉండాలి అంటూ ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. మద్యం కోసం డ్రగ్స్ కోసం యువత బయటకు వెళ్ళకుండా ఉండమని చెప్పడమే నా ఉద్దేశం అంటూ ప్రయత్నాలు చేసిన ఈయనపై విమర్శలు అధికమయ్యాయి.
మహిళా ఉద్యోగుల పట్ల ఈయన ఆసభ్యకర పదాలను ఉపయోగిస్తూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన రికార్డ్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా తన గురించి ఎన్నో ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటలీ ప్రధాని అయినటువంటి జార్జియా మెలోని నుంచి తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునో విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించేశారు.
గియాంబ్రునో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కారణంగానే మా బంధం బీటలు బారిందని దాదాపు పది సంవత్సరాల మా బంధం తెగిపోయింది అంటూ వెల్లడించారు. కొంతకాలంగా మేము ప్రయాణించే మార్గాలు వేరయ్యాయి అయితే నేను వాటిని గుర్తించడంలో ఆలస్యం చేసానంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరికీ ఓ చిన్నారి కూడా ఉన్నారు కేవలం తన భర్త వ్యవహార శైలి నచ్చకనే ఈమె విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది.