Nalgonda: దారుణం.. పెళ్లి అయ్యి నెలరోజులు కూడా కాకముందే?

Nalgonda: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఊహించని ఘటనలు దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన నవ దంపతుల విషయంలోనే ఎక్కువగా విషాదాలు నెలకొంటున్నాయి. కోటి ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్న నవ దంపతుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెళ్లయ్యి నెలరోజులు కూడా కాకముందే తీరని విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్, అలివేలు భార్యాభర్తలు. వీరి ఏకైక కుమారుడే బొడ్డుపల్లి వెంకటేష్ అనే 29 ఏళ్ళ వ్యక్తి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ మే 11 న వెంకటేష్ కు గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు అంతా అయిపోయాయి. తిరిగి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్న వెంకటేష్ ఆదివారం రోజు సెలవు దినం కావడంతో తన స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఊర్లో బొడ్రాయి పండుగ ఉత్సవాలు ఉండడంతో ఆఫీస్‌కు సెలవులు పెట్టాలని అనుకున్నాడు. ఆఫీస్‌లో ఇన్‌ఫాం చేయటానికి సోమవారం వెంకటేష్ తన స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనం పై హైదరాబాద్‌ బయలుదేరాడు.

 

ఆఫీస్‌లో పని ముగించుకుని సాయంత్రం తిరిగి గ్రామానికి పయనమయ్యాడు. అయితే అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొండమల్లెపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర మలుపు తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం వెంకటేష్‌ ఉన్న బైకును డీకొట్టింది. దీంతో వెంకటేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. పెళ్తెన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ మృతి చెందడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. వెంకటేష్ మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -