Jabardasth Rakesh: వైరల్ అవుతున్న జబర్దస్త్ రాకేష్ షాకింగ్ కామెంట్స్!

Jabardasth Rakesh: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లలో చేసి తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు రాకేష్. మొదట్లో ఇతర టీమ్ లలో కంటెస్టెంట్ గా చేసిన రాకేష్ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదగడంతో మొదట చిన్న పిల్లలతో కలిసి స్కిట్లు వేస్తూ ప్రతి ఒక్కరిని కడప నవ్వించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పెద్ద వారిని తీసుకువస్తూ ప్రస్తుతం పెద్ద పెద్ద కమెడియన్లతోనే స్కిట్లు చేస్తున్నాడు. ఇకపోతే రాకింగ్ రాకేష్ ఇటీవలే ఒక ఇంటి వాడైన సంగతి మనందరికీ తెలిసిందే. జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మొదట్లో వీరిద్దరూ కలిసి స్కిట్లు చేయడంతో పాటు రొమాంటిక్ గా డాన్సులు చేయడం ప్రపోజ్ చేసుకోవడంతో వీళ్ళు కూడా సుదీర్ రష్మీల మాదిరి అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ వీరు నిజమైన లవ్ అని ప్రూవ్ చేసుకుంటూ ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇకపోతే పైకి నవ్వుతూ కనిపించే జబర్దస్త్ రాకేష్ తెరవెనుక అలాగే కెరియర్ మొదట్లో ఎన్నో రకాల కష్టాలను అనుభవించినట్లు ఇప్పటికే జబర్దస్త్ స్టేజ్ పై అలాగే ఇతర సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రాకేష్ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వీడియో చేసి యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటారు.

 

భార్యాభర్తలిద్దరూ జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరొకవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు.. ఇది ఇలా ఉంటే తాజాగా రాకింగ్ రాకేష్ తన తల్లితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ మొదటి నుంచి ఇప్పటివరకు నీ మీద ఉన్న వరస్ట్ రూమర్ అంటే ఏం చెప్తావు అని అడగగా.. ఎక్కడ మనం లేస్తావో అక్కడ అవమాన పడతాము. నేను ఎవరికైతే అన్నం పెట్టాను వాళ్లే నా గురించి బ్యాడ్ గా చెప్పడం అన్నది నిజంగా నా లైఫ్ లో వరస్ట్ రూమర్ అని తెలిపాడు రాకేష్. కానీ మనం పెట్టినది మర్చిపోయి ఎథిక్స్ మరిచిపోయి అలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. నాకు ధనరాజ్ అన్న ప్రతి ఒక్క రూపాయి గుర్తుకు ఉంది నేను ఇప్పటికీ అదే విషయాన్ని చెబుతూనే ఉంటాను. నా లైఫ్ ఆయన పెట్టిన బిక్షనే అని తెలిపారు రాకేష్. ఎక్కడో మిమిక్రిలు చేసుకుంటూ ఉన్న నన్ను బాగా చేస్తున్నావు అని చెప్పి జబర్దస్త్ తీసుకెళ్లి నన్ను ఈ స్థాయి వరకు తీసుకోవచ్చు అని తెలిపారు రాకేష్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -