Jabardasth: అన్నం లాక్కొని పంపించేశారు.. ఏడ్చేశాను.. జబర్దస్త్ కమెడియన్ వ్యాఖ్యలు

Jabardasth: జబర్దస్త్ షో ద్వారా అనేక మంది నటులు లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. పలువురు కాస్ట్ లీ కార్లు కొని వాటిలో తిరుగుతున్నారు. విలువైన ఆస్తులు పోగేసుకున్నారు. ఇదంతా మల్లెమాల యాజమాన్యం, ఈటీవీ దయ వల్లనేనంటూ చాలా మంది అనేక వేదికలపై తమ అభిప్రాయాలు చెబుతూ వస్తున్నారు. అలాంటి వారిలో అభి, ఆది, సుధీర్, రాం ప్రసాద్, చంటి, చంద్ర, గెటప్ శ్రీను… ఇలా చాలా మంది ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ చాన్స్ లతో సినిమాల్లోకీ ప్రవేశించారు చాలా మంది.

 

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు పొందిన వారిలో జబర్దస్త్ గడ్డం నవీన్ కూడా ఒకరు. గడ్డం నవీన్ కమెడియన్ గా మంచి స్కిట్లు చేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. అయితే, జబర్దస్త్ లోకి రాక ముందే అనేక సినిమాల్లో నటించినా అంత ఫేమ్ సంపాదించుకోలేదు ఈ నటుడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నాడు. సిక్స్ టీన్స్ అనే మూవీలో హీరో గ్యాంగ్ లో తనకు అవకాశం లభించిందని, డైలాగ్స్ ఎస్టాబ్లిష్ అయ్యానని తెలిపాడు.

 

చాలా సినిమాల్లో నటించాను..
జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాలో నటించానని, కానీ డైలాగ్స్ ఉండవని నవీన్ తెలిపాడు. ఇష్టం అనే మూవీలో శ్రీనివాస్ రెడ్డితో పాటు నటించానని చెప్పాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన మూడు ముక్కలాట మూవీలో తాను ఓ రోల్ చేసినట్లు వివరించాడు. తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ, అల్లుడు శీను చిత్రాల్లో నటించానని వెల్లడించాడు. సగానికి పైగా రౌడీ షీటర్ క్యారెక్టర్ లో నటించానన్నాడు.

 

కానీ ఎన్ని సినిమాలు, స్కిట్లు చేసినా తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి అని గడ్డం నవీన్ తెలిపాడు. సినిమాల్లోకి రావడం అంటే తన తల్లికి చాలా ఇష్టమని తెలిపాడు. తన తల్లిదండ్రుల సపోర్ట్ తోనే తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు వివరించాడు. ఇక క్యారెక్టర్ల కోసం సినిమా షూటింగ్ ల వద్ద, నిర్మాణ సంస్థల వద్ద పడిగాపులు కాశానని, ఈ క్రమంలో ఓ షూటింగ్ లో అవకాశం వచ్చిందన్నాడు. అయితే, ఆ రోజు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకు భోజనం పెట్టే దగ్గర ఉన్నానని, ఈ క్రమంలో తన ప్లేట్ లాగేసుకొని అన్నం డస్ట్ బిన్ లోపడేశారని చెప్పాడు. ఆ సమయంలో చాలా ఏడ్చేశానని గుర్తు చేసుకున్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -