Varsha-Immanuel: భారీ కండిషన్ ల నడుమ ఇమ్యూతో పెళ్లికి సిద్ధమైన వర్ష?

Varsha-Immanuel: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఇమ్మానుయేల్ వర్ష జంట ఒకటి.ఈ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ రష్మీ జంటకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో వర్ష ఇమ్మానుయేల్ జంటకు కూడా అదే స్థాయి క్రేజ్ వచ్చింది.వీరిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసి ఎన్నో అద్భుతమైన స్కిట్లను పర్ఫామెన్స్ చేయడమే కాకుండా ఇదివరకే వీరిద్దరికి జబర్దస్త్ వేదికపై ఎన్నోసార్లు పెళ్లి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాగే వర్ష సైతం ఇమ్మానియేల్ గురించి మాట్లాడుతూ పలుమార్లు తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.ఇదిలా ఉండగా తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా వర్ష ఏకంగా ఇమ్మానుయేల్ తో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఇది కేవలం జబర్దస్త్ కార్యక్రమం కోసం మాత్రమే. ఈ క్రమంలోనే ఇమ్మానుయేల్ వర్షను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని రాగ వర్షా మాత్రం తనకు కండిషన్లు పెడుతుంది. వర్ష తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని తెగ సంతోషపడ్డాడు. అయితే తనని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్లకు తాను ఒప్పుకోవాలని ఈమె కండిషన్ పెట్టింది.

మన పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పగా వెంటనే ఇమ్మానుయేల్ తనకు మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున పవన్ కళ్యాణ్ వంటి వారందరూ తెలుసని చెబుతాడు అయితే వారు తన పెళ్లికి రావాలని వర్షా చెప్పగా ఇమాన్యుయల్ ఈ హీరోల డూపులను వేదిక పైకి తీసుకురావడమే కాకుండా వారు కూడా డ్యాన్సులతో రప్ఫాడించారు. అలానే పల్సర్ బైక్ సాంగ్ కి ముగ్గురు డూప్ లతో కలిసి వర్ష స్టెప్పులేసింది. మొత్తానికి ఈ ప్రోమో ఎంతో ఫన్నీగా కొనసాగిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -