Jabardasth: వైరల్ అవుతున్న జబర్దస్త్ వర్ష షాకింగ్ కామెంట్స్!

Jabardasth: జబర్దస్త్ వర్ష.. ప్రస్తుతం పరిచయం అవసరం లేని స్థాయిలో ఫేమస్ అయిన ఆర్టిస్ట్. హీరోయిన్ ల వంటి హాట్ హాట్ ఫిజిక్ తో.. జబర్దస్త్ షో తో బుల్లితెరను ఒక ఊపు ఊపిన వర్ష.. సోషల్ మీడియాలో ఎనలేని ఫాలోయింగ్ తన సొంతం చేసుకుంది. ఇక డబుల్ మీనింగ్ డైలాగులతో వర్ష ఇమ్మాన్యుయేల్ జంట చేసే కామెడీ అంతా ఇంతా కాదు. వాళ్ళ మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ అడ్డంగా పెట్టుకుని జబర్దస్త్ షో తో పాటు, వర్ష కూడా బాగా పాపులర్ అయ్యింది.

ఇక మొన్నామధ్య ఇమ్మాన్యుయేల్.. వర్ష మెడలో తాళి కట్టడం.. దానికి వర్ష ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే ఎదో నడుస్తుందనే వాదనలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇంకా వర్ష పుట్టిన రోజు సందర్బంగా.. ఆమెకో హారాన్ని కొని బహుమతిగా ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. అయితే వీరి సంబంధంపై ఆఫీషియల్ గా ఎలాంటి ప్రకటనలు లేవు. కాగా ఇవన్నీ కేవలం పాపులారిటీ కోసం చేసే స్టంట్స్ మాత్రమేనని లోపలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉండగా అసలు వాళ్ళింట్లో జబర్డస్త్ షో ని మానేయమంటున్నారని.. జబర్దస్త్ లో చేస్తున్న స్కిట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ దారుణంగా ఉంటున్నాయని.. దీనితో ఇంట్లో అలా అంటున్నారని ఒక ఎపిసోడ్ లో చెప్తూ వాపోయింది ఈ బుల్లితెర సుందరి. ఇక దీనితో నిజంగానే వర్ష జబర్దస్త్ మానేస్తుందని ఆ మధ్య టాక్ నడించింది.

ప్రస్తుతం వర్ష రీసెంట్ గా చేసిన ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్లె తనం ఉట్టిపడేలా.. ఒక సింపుల్ చీరకట్టులో.. పొలాలకు నీళ్లు పడుతూ, ఎడ్ల బండిపై, పక్క పల్లెటూరు వాతావరణంలో చేసింది ఈ షూట్. ఇక ఈ ఫోటో షూట్ లోని ఫోటోలు అభిమానులకు విందుగా మారాయి. అసలు జబర్దస్త్ కంటే ఇలా చాలా బాగున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్. ఇంకెన్ని రోజులు ఇమ్మాన్యుయేల్ తో అవన్నీ వదిలి, సినిమాల్లో చెయ్ మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -